Advertisement
Google Ads BL

విషాదంలో రజినీకాంత్


సూపర్ స్టార్ రజినీకాంత్ ఈమధ్యనే అమెరికా రెగ్యులర్ హెల్త్ చెకప్ కి వెళ్లి తిరిగి చెన్నై కి రావడమే కాదు.. ఆయన నటిస్తున్న అన్నాత్తై షూటింగ్ కి కూడా హాజరవుతున్నారు. అయితే తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కారణం ఆయన ప్రాణ స్నేహితుడు రామచంద్ర ఈ రోజు ఉదయమే కన్ను మూసారు. రజినీకాంత్ స్నేహితుడు రామచంద్ర మృతిపై పలువురు స్నేహితులు, సన్నిహితులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. రామచంద్రరావు మాత్రమే కాదు ఇతర స్నేహితులతో రజనీకాంత్ అనుబంధం ఎలా ఉండేదంటే.. స్నేహానికి ప్రాణం ఇచ్చేంత అనుబంధం ఉండేది. 

Advertisement
CJ Advs

రజినీకాంత్ మరికొంతమంది ఫ్రెండ్స్ 1966లో పరీక్షల్లో తప్పడమే కాదు.. తమకి పెద్దగా తెలివితెతలు లేవని ఫీలయ్యాయేవారు. ఇక రజినీకాంత్, రామచంద్ర కర్ణాటకలోని సంయుక్త కర్ఠాటక న్యూస్ పేపర్‌లో 150 రూపాయల జీతానికి పనిచెయ్యగా.. రామచంద్ర ఇన్నాళ్లుగా అదే పేపర్ లో పనిచేస్తూ రెండేళ్ల క్రితమే రిటైర్ అయ్యారు. ఇక రజిని ఓ ఐదు నెలలు అక్కడ ఉదోగం చేసి మానేసి.. వేరే చోట పనికి కుదిరి.. అక్కడ నుండి బస్సు కండక్టర్ గా జాబ్ చేసి చివరికి హీరోగా సూపర్ స్టార్ అయ్యారు. రజిని సూపర్ స్టార్ అయినా రామచంద్ర తో స్నేహాన్ని వీడలేదు. 73 సంవత్సరాలు కలిగిన రామచంద్ర ఈ రోజు గురువారం ఉదయం పరమపదించడం రజినీకాంత్ ని తీవ్రంగా కలిచి వేసింది. 

Rajinikanth in huge tragedy:

Rajinikanth Friend And Journalist Ramachandra passed away
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs