Advertisement
Google Ads BL

జగన్ బెయిల్ రద్దు తీర్పు వాయిదా


ఎప్పటినుండో సీబీఐ కోర్టు లో నడుస్తున్న అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న ఆంధ్ర సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్లపై తీర్పు వాయిదా పడింది. జగన్‌, విజయసాయి బెయిల్‌ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై కొంతకాలంగా నాంపల్లిలోని సీబీఐ కోర్టు లో వాదనలు జరుగుతున్నాయి. 

Advertisement
CJ Advs

ఈ కేసులో జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు పూర్తికాగా... తీర్పును అప్పటినుంచి కోర్టు రిజర్వు చేసింది. ముఖ్యమంత్రిగా తనకుండే అధికారాలను ఉపయోగించి.. జగన్‌ బెయిల్‌ షరతులు ఉల్లంఘిస్తున్నారని రఘురామ ఏప్రిల్‌ మొదటి వారంలో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపించారు. ఇక ఇప్పుడు ఎంపీ విజయసాయి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై ఈరోజు వాదనలు ముగిశాయి. అయితే ఈ రెండు పిటిషన్లపై ఒకే రోజు తీర్పు వెలువరిస్తామని సీబీఐ కోర్టు వెల్లడించింది. తీర్పు వెల్లడిని వచ్చే నెల 15కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు.

CBI court adjourns the verdict on YS Jagan bail cancellation:

The CBI court on Friday heard the petition over the cancellation of YS Jagan bail in Disproportionate Assets cases has adjourned
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs