బిగ్ బాస్ ఈసారి కొత్త హంగులతో
బిగ్ బాస్ సీజన్ 5 కి రంగం సిద్ధమైంది. ఇప్పటికే బిగ్ బాస్ ప్రోమోస్ తో షో మీద హైప్ క్రియేట్ చేస్తున్న స్టార్ మా సెప్టెంబర్ 5 నుండి బిగ్ బాస్ ని గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు అన్ని సిద్ధం చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 5 హౌస్ లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ తో ఇప్పుడు వాళ్ళని క్వారంటైన్ కి పంపబోతున్నారు. బిగ్ బాస్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ అంతా.. ఆగష్టు 26 నుండి సెప్టెంబర్ 3 వరకు క్వారంటైన్ లో ఉండబోతున్నారు. కరోనా నిబంధనల ప్రకారమే.. కంటెస్టెంట్స్ కి ఇలా క్వారంటైన్ చేస్తుంది బిగ్ బాస్ యాజమాన్యం.
ఇక ఫైనల్ లిస్ట్ లో ఉన్న యాంకర్ రవి, నవ్య స్వామి, సిరి లాంటి వారిని హైదరాబాద్ నగరంలో ఐటీసీకి చెందిన ఫైవ్ స్టార్ హోటల్లో క్వారంటైన్ కి పంపనున్నారని సమాచారం. అంటే సెప్టెంబర్ 4th నుండి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ నాగార్జున హోస్ట్ గా మొదలు కాబోతుంది అని తెలుస్తుంది. ఇక ఈసారి బిగ్ బాస్ హౌస్ లో కొత్త హంగులు ఉండబోతున్నాయని, ఇప్పటివరకు అంటే 4 సీజన్స్ చూసిన హౌస్ ఒక ఎత్తైతే.. ఈసారి సీజన్ హౌస్ మరో ఎత్తు అనేలా డిజైన్ చేసిందట యాజమాన్యం. అలాగే హౌస్ మొత్తం గ్లామర్ నటులతో కలర్ ఫుల్ గా మారబోతుంది అని, బిగ్ బాస్ లో ఈసారి నాగార్జున ఎంటర్టైన్మెంట్ ని మరింతగా పెంచబోతున్నట్టుగా సమాచారం.
Advertisement
CJ Advs
Bigg Boss with new twists this time:
<pre id="tw-target-text" class="tw-data-text tw-text-large XcVN5d tw-ta" dir="ltr"><span class="Y2IQFc" lang="en">The scene is set for Bigg Boss Season 5 </span></pre>
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads