Advertisement
Google Ads BL

ప్రభాస్ సలార్ 2023 కి వెళ్ళిందటగా..


కన్నడ సంచలనం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మొదలైన సలార్ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యింది. మాస్ మసాలా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా శృతి హాసన్ నటిస్తుండగా.. రాజమన్నార్ గా పవర్ ఫుల్ విలన్ గా టాలీవుడ్ టాప్ స్టార్ జగపతి బాబు నటిస్తున్నాడు. అయితే సలార్ మొదలైనప్పుడే సలార్ ని ఏప్రిల్ 14 2022 న విడుదల చేస్తామంటూ సలార్ టీం ప్రకటించింది. ఇప్పుడు ప్రభాస్ సినిమాలే కాదు, చాలా సినిమాలు కరోనా సెకండ్ వేవ్ వలన షూటింగ్స్ వాయిదా పడడంతో.. రిలీజ్ డేట్స్ అన్ని మారిపోతున్నాయి. 

Advertisement
CJ Advs

అందులో ముఖ్యంగా ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ చాప్టర్ 2 వచ్చే ఏడాది ఏప్రిల్ 14 అంటే సలార్ డేట్ కి వెళ్ళిపోయింది. దానితో ప్రభాస్ ఫాన్స్ తెగ ఫీలవుతున్నారు. అంటే ప్రభాస్ సలార్ డేట్ మారిపోయింది. మళ్ళీ ఎప్పుడు సలార్ డేట్ ఇస్తారో అంటూ ప్రభాస్ ఫాన్స్ హంగామా చేస్తుంటే.. ప్రస్తుత పరిస్థితులు బట్టి ప్రశాంత్ నీల్ - ప్రభాస్ కాంబో సలార్ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ అవ్వబోదని.. ఎలా లేదన్నా సలార్ 2023 కి వెళ్లిపోవడం పక్క అంటూ కొన్ని న్యూస్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించిన ప్రకటనను అతి త్వరలోనే ఇవ్వనున్నారని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. 

Prabhas Salaar New release date?:

Did Prabhas Salaar go to 2023
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs