జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెర మీద దున్నేస్తున్న అనసూయ భరద్వాజ్ మరోపక్క వెండితెర మీద కూడా అదరగొట్టేస్తుంది. రంగస్థలం తో అనసూయ రంగమ్మత్తగా అందరి మదిలో మరిచిపోలేని పాత్రతో ఆకట్టుకుంది. ఆ తర్వాత సుకుమార్ మరోసారి పుష్ప మూవీలో అనసూయకి అదిరిపోయే రోల్ ఇచ్చినట్టుగా అనసూయ చెప్పింది. ప్రస్తుతం పుష్ప షూటింగ్ అలాగే రవితేజ ఖిలాడీ షూటింగ్స్ లో పాల్గొంటున్న అనసూయకి ఇప్పుడు మెగాస్టార్ చిరు గాడ్ ఫాదర్ లోను ఓ అదిరిపోయే రోల్ వచ్చినట్టుగా టాక్.
మోహన్ రాజా - చిరు కాంబోలో మలయాళ లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీలో అనసూయకి ఓ కీలక పాత్ర ఇవ్వడమే కాదు.. ఆమె కాల్షీట్స్ కూడా తీసుకున్నట్లుగా సమాచారం. ఈ సినిమాలో అనసూయ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని కూడా అంటున్నారు. మరి నిజంగానే అనసూయ గాడ్ ఫాదర్ లో నటిస్తుంటే ఆమె అభిమానులకి పండగే.