ప్రభాస్ - ఓం రౌత్ కాంబోలో బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీ షూటింగ్ ముంబై లోని ఓ భారీ సెట్ లో జరుగుతుంది. ప్రస్తుతం ఆదిపురుష్ షూటింగ్ చిత్రీకరణలో ప్రభాస్ పాల్గొటున్నారు. ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్న ఈ సినిమాలో రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, సీత గా కృతి సనన్ నటిస్తుంది. వన్ నేనొక్కడినే, నాగ చైతన్య దోచేయ్ సినిమాల్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న కృతి సనాన్ బాలీవుడ్ లో పేరున్న హీరోయిన్. ఆదిపురుష్ లో కృతి సనన్ హీరోయిన్ అనగానే ఆమె క్రేజ్ సోషల్ మీడియాలో పెరిగిపోయింది.
తాజాగా కృతి సనాన్ పెళ్లి కూతురు గెటప్ లో అదరగొట్టేసింది. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన పెళ్లి కూతురు వస్త్రాల్లో కృతి సనాన్ అదరగొట్టేసింది. ప్రస్తుతం కృతి సనాన్ పెళ్లి కూతురు గెటప్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చేతులకి పెళ్లి కూతురు వేసుకునే గాజులు, నుదుటిన పెళ్లి బొట్టు, పెళ్లి బట్టలు ఇలా కృతి సనాన్ పెళ్లి కూతురు గెటప్.. ఆదిపురుష్ సీత కేరెక్టర్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది. ప్రస్తుతం కృతి సనాన్ పెళ్లి కూతురు గెటప్ ఫొటోస్ అన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.