Advertisement
Google Ads BL

మంచు విష్ణు లవ్ స్టోరీ: భారీ ట్విస్టులు


మంచు మోహన్ బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు వెరోనికా ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వెరోనికా తో ప్రేమ వ్యవహారంలో బోలెడన్ని ట్విస్ట్ లు ఉన్నాయని.. రీసెంట్ గా మంచు విష్ణు అలీతో సరదాగా ప్రోగ్రాం లో పాల్గొన్నప్పుడు తన ప్రేమలోని ట్విస్ట్ లు, తన ప్రేమకి హెల్ప్ చేసిన వారి పేర్లు బయటపెట్టాడు. మంచు విష్ణు - వెరోనికా కలిసి ఒక ఏడాది పాటు ఎవరికీ తెలియకుండా ప్రేమించుకున్నారట. తండ్రి మోహన్ బాబు కి అస్సలు తెలియకుండా మేనేజ్ చేశారట. విష్ణు తల్లికి తెలిసి ఆమె మంచు విష్ణు కి సపోర్ట్ చేశారట. అయితే వెరోనికా మంచు విష్ణు షూటింగ్ బ్రేక్ టైం లో తాజ్ కృష్ణ లో లంచ్ టైం లో కలుసుకునేవారట. నైట్ అయితే తండ్రి, ఫ్యామిలీ తో కలిసి డిన్నర్ చెయ్యాలి కాబట్టి దొరికిపోతామని లంచ్ టైం లో కలిసేవారట. 

Advertisement
CJ Advs

అయితే ఓసారి తాజ్ కృష్ణ లో లంచ్ టైం లో మోహన్ బాబు అక్కడి వచ్చేస్తుంటే.. హోటల్ సర్వర్ చూసి సర్ పెద్ద సర్ వస్తున్నారనగానే మంచు విష్ణు కి చమటలు పట్టేశాయట. దానితో హోటల్ మేనేజర్ మంచు విష్ణు - వెరోనికాలని కిచెన్ డోర్ నుండి బయటికి పంపేసారట. హోటల్ వాళ్ళకి మంచు విష్ణు లవ్ స్టోరీ గురించి తెలుసట. ఇక మంచు విష్ణు వెరోనికాని లవ్ చేస్తున్నట్టుగా మీడియా లో వచ్చిన న్యూస్ చూసి విష్ణు ని మోహన్ బాబు అడగ్గా.. లేదు నాన్నగారు మీరు ఏ అమ్మాయిని చూపిస్తే ఆ అమ్మాయినే చేసుకుంటాను అని చెప్పాడట. 

తర్వాత రంగంలోకి దాసరి వైఫ్ దిగి మోహన్ బాబు కి నచ్చే జెప్పి విష్ణు కి సపోర్ట్ చేశారట. అలాగే బ్రహ్మానందం కూడా మోహన్ బాబు తో మాట్లాడి విష్ణు నువ్వు వెరోనికనే పెళ్లి చేసుకుంటున్నావ్ అంతే.. మోహన్ బాబు ఏం చేస్తారో చూస్తాను అంటూ ఛాలెంజ్ చేశారట. తర్వాత ఇరు పెద్దలు మాట్లాడుకుని తమకి ఎంగేజ్మెంట్ చేసారంటూ మంచు విష్ణు అలీ తో సరదాగా ప్రోగ్రాంలో చెప్పుకొచ్చాడు.

Manchu Vishnu Love Story:

Manchu vishnu In alitho saradaga Program
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs