బాలీవుడ్ లో హిట్ అయిన అంధధూన్ మూవీని తెలుగులో నితిన్ మాస్ట్రో మూవీగా రీమేక్ చేసాడు. నితిన్ హీరోగా నటించిన 30వ చిత్రమిది. తన కెరీర్‌లో ఇదొక మైల్ స్టోన్ మూవీ. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కరోనా కారణముగా డిస్ని ప్లస్ హాట్ స్టార్ ఓటిటి నుండి త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో నితిన్ కళ్లు కనిపించన దివ్యాంగుడైన యువకుడిగా, పియానో ప్లేయర్‌గా విలక్షణమైన పాత్రలో నటించడం విశేషం.
తాజాగా మ్యాస్ట్రో ట్రైలర్ ని రిలీజ్ చేసింది టీం. ట్రైలర్‌ను గమనిస్తే.. సినిమాలో ని కీలక పాత్రలన్నీ కనిపిస్తాయి. నితిన్ పియానో ఎక్స్‌పర్ట్‌గా తన ప్రతిభను చూపిస్తుంటారు. నభా నటేశ్ అతని ప్రేయసి పాత్రలో కనిపిస్తుంది. నితిన్ కంపోజ్ చేసే మ్యూజిక్‌ను ఆమె ఎప్పుడూ అప్రిషియేట్ చేస్తుంటుంది. ఇక తమన్నా పాత్ర.. నితిన్ జీవితాన్ని మార్చే పాత్రలో కనిపిస్తుంది. తమన్నా భర్త పాత్రలో వి.కె.నరేశ్ కనిపించారు.
ప్రతి ఆర్టిస్ట్‌లాగానే నితిన్ జీవితంలోనూ ఓ సీక్రెట్ ఉంటుంది. అతను కళ్లు కనిపించని దివ్యాంగుడు కాకపోయినా, అలా నటిస్తుంటాడు. అలా నటించడం ఎందుకు? జిస్సు సేన్ గుప్తా ఓ పోలీస్ ఆఫీసర్, నితిన్ సాక్ష్యంగా ఓ మర్డర్ కేసుని పరిశోధిస్తుంటాడు. మిల్కీబ్యూటీ తమన్నా నెగటివ్ షేడ్ పాత్రలో నటించింది. ఆమె రోల్‌కు సంబంధించి చివరలో వచ్చే సీక్వెన్స్ హిలేరియస్‌గా ఉంది. మొత్తానికి మాస్ట్రో ట్రైలర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. సినిమాలో రొమాన్స్, ట్విస్టులు, కామెడీ ఇలా అన్ని కమర్షియల్ అంశాలున్నాయి. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.