కరోనా సెకండ్ వేవ్ తగ్గడంతో ఈ నెల 16 న ఏపీలో స్కూల్స్ మళ్లీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో ప్రతి రోజు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు రీసెంట్ గా ఓపెన్ చేసిన స్కూల్స్ లో కూడా కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలులో డీఆర్ఎం మున్సిపల్ స్కూలులో ముగ్గురు ఉపాధ్యాయులు, ముగ్గురు చిన్నారులు కరోనా బారిన పడ్డారు.
అలాగే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఎంపీసీ కండ్రిగలోని స్కూలులో ఐదుగురు విద్యార్థులకు కరోనా సోకింది. కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రు హైస్కూల్లో 10 మందికి కరోనా సోకడం కలకలం సృష్టించింది. దానితో కరోనా సోకిన స్కూల్స్ కి విద్యాశాఖ అధికారులు సెలవులు ప్రకటించారు. అయితే స్కూల్స్ తెరవడంతో.. విద్యార్థులు స్కూల్స్ కి తప్పనిసరిగా వెళ్లాల్సి రావడం, అక్కడ స్కూల్స్ లో కరోనా కేసులు వస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.