నేడు రాఖి పౌర్ణమి, మెగాస్టార్ చిరు బర్త్ డే వేడుకలని మెగా ఫ్యామిలీ ఓ రేంజ్ లో నిర్వహించింది. ఈ వేడుకలకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలు ఒక్క ఎత్తైతే.. మెగా ఫ్యామిలీ రాఖి పౌర్ణమి వేడుకలు మరో ఎత్తు అన్న రేంజ్ లో జరిగాయి. మెగాస్టార్ చిరు బర్త్ డే స్పెషల్ గా ఓ పార్టీ జరగగా.. మెగా ఫ్యామిలీ మొత్తం పాల్గొన్నది. ఇక మెగా ఫ్యామిలీ రాఖి వేడుకల్లో పవన్ కళ్యాణ్, నాగబాబు, చిరు సిస్టర్స్ పాల్గొన్నారు. అలాగే రామ్ చరణ్ అక్క, చెల్లెలు సుష్మిత, శ్రీజలు పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మెగాస్టార్ చిరు ఇంటికి వచ్చి అన్నయ్యకి ప్రేమతో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తన అక్కలతో రాఖి కట్టించుకుని పవన్ అక్కల నుండి ఆశీర్వచనం పొందిన ఫొటోస్, చిరు కి ఆయన చెల్లెలు రాఖి కట్టిన పిక్స్, నాగబాబు సిస్టర్స్ తో రాఖి కట్టించుకున్న ఫోటో తో పాటుగా.. రామ్ చరణ్ తన అక్క చెల్లెలు తో రాఖి సెలెబ్రేషన్స్ చేసుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.