Advertisement
Google Ads BL

కెజిఎఫ్ 2: మరీ ఘోరం భయ్యా


కరోనా సెకండ్ వేవ్ మరోసారి  సినిమా లవర్స్ కి భారీ షాక్ ఇచ్చింది. ఈ ఏడాది విడుదల కావాల్సిన భారీ బడ్జెట్ మూవీస్ అన్నీ.. వచ్చే ఏడాదికి షిఫ్ట్ అవుతున్నాయి. ప్రభాస్ రాధేశ్యామ్ వచ్చే సంక్రాంతికి వెళ్లగా... అల్లు అర్జున్ పుష్ప పాన్ ఇండియా మూవీ డిసెంబర్ ఫెస్ట్ క్రిష్టమస్ కి వెళ్ళిపోయింది. ఇక రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ పై ఊహాగానాలు ఉన్నాయి. మరోపక్క కన్నడ సంచలనం కెజిఎఫ్ 2 కూడా డిసెంబర్ లో రీలీజ్ కాబోతుంది అనే ప్రచారం జరుగుతుంది. 

Advertisement
CJ Advs

అయితే ఉన్నట్టుండి రాఖి పౌర్ణమి రోజున కెజిఎఫ్ 2 రిలీజ్ డేట్ ఇచ్చారు మేకర్స్. వచ్చే ఏడాది అంటే 2022 ఏప్రిల్ 14 న కెజిఎఫ్ చాప్టర్ 2 ని రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఏ జనవరో, ఏ ఫెబ్రవరో అంటే ఓకె కానీ ఏకంగా ఏప్రిల్ ఏంటి భయ్యా.. ఇది మరీ ఘోరం అంటున్నారు కెజిఎఫ్ ఫాన్స్, యష్ ఫాన్స్. దాదాపుగా ఎనిమిదినెలలు పోస్ట్ పోన్ చేసారు ఏమిటి భయ్యా అంటూ సోషల్ మీడియాలో కెజిఎఫ్ ఫాన్స్ మేకర్స్ ని తగులుకున్నారు. ఈ ఏడాదో ఏదో ఒక డేట్ సెట్ చెయ్యాల్సింది. కానీ వచ్చే ఏడాది ఏప్రిల్ అంటే మరీ లేట్ కదా అంటున్నారు. 

KGF 2 new release date locked:

Big surprise KGF 2 release on April 14th 2022
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs