ప్రశాంత్ నీల్ - ప్రభాస్ కాంబోలో పాన్ ఇండియా లెవల్లో మొదలైన సలార్ షూటింగ్ సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణలో ఉంది. ఈ నెల మొదటి వారంలోనే సలార్ సెకండ్ షెడ్యూల్ మొదలైంది. ప్రభాస్ సలార్ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ లో పాల్గోంటున్నారు. కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో మాస్ ఎంటర్టైనెర్ గా సలార్ ని పాన్ ఇండియా మార్కెట్ లోకి వదలబోతున్నాడు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా సలార్ లో మెయిన్ విలన్ గా ఎవరిని ఫిక్స్ చెయ్యలేదు కానీ.. సలార్ ప్రభాస్ తో ఫామిలీ మ్యాన్ 2 హీరో మనోజ్ భాజపేయీ తలపడబోతున్నాడని, సలార్ విలన్ గా మనోజ్ భాజపేయీ నటించే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది.
అయితే ఇప్పుడు సలార్ నుండి అదిరిపోయే అప్ డేట్ బయటకి వచ్చింది. అదేమిటంటే సలార్ నుండి రాజమనార్ ని ఇంట్రడ్యూస్ చెయ్యబోతున్నట్టుగా.. అది కూడా రేపు ఉదయం 10.30 కి రివీల్ చెయ్యబోతున్నట్టుగా అప్ డేట్ ఇచ్చింది టీం. అయితే ఇప్పుడు అందరిలో రాజమన్నార్ అంటే ఎవరు అనే క్యూరియాసిటీ మొదలయ్యింది. ప్రభాస్ పేరే రాజమనారా లేదంటే ఈ సినిమాలో సెకండ్ కేరెక్టర్ ప్రభాస్ తండ్రి పాత్ర పేరు రాజామన్నార్ అనే అనుమానాలు, సస్పెన్స్ అందరిలో మొదలైపోయింది. మరి రేపు ఈపాటికి సలార్ రాజమానార్ ఎవరో తెలిసిపోతుంది. కానీ ఈలోపు ప్రభాస్ ఫాన్స్ ఆగేలా కనిపించడం లేదు.