టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ - రష్మిక ఒకేసారి కెరీర్ స్టార్ట్ చెయ్యడం.. ఒకే సినిమాతో ఇద్దరూ స్టార్ డం సంపాదించడంతో.. వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. రష్మిక - విజయ్ దేవరకొండ ఫ్రెండ్స్ అవడం, తరుచు కలవడంతో అందరూ వారి మధ్యన సం థింగ్ సం థింగ్ అనుకునేలా గాసిప్స్ మొదలయ్యాయి. కానీ విజయ్ దేవరకొండ - రష్మిక ఇద్దరూ కూడా తమ మధ్యన స్నేహం తప్ప మరేం లేదంటూ క్లారిటీ ఇస్తూనే ఉంటారు. ఇక హైదరాబాద్ లోనే కాదు.. ఇప్పుడు ముంబై లోను రష్మిక - విజయ్ ల స్నేహం మీడియా కంటబడింది.
హైదరాబాద్ కి రష్మిక వచ్చినప్పుడు విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లకుండా ఉండదు. అదే రష్మిక ముంబై వెళ్ళినప్పుడు లైగర్ షూటింగ్ లో ఉండే విజయ్ ని కలుస్తుంది. సో అలా వారి మధ్యన డిన్నర్ డేట్స్ అవి బాగా హైలెట్ అవుతున్నాయి. తాజాగా విజయ్ దేవరకొండ - రష్మిక ఇద్దరూ జిమ్ లో వర్కౌట్ గోల్స్ తో చేసిన హడావిడి ఫొటోస్ రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రష్మిక వర్కౌట్ సెల్ఫీలలో విజయ్ దేవరకొండా లైగర్ లుక్ లో ఫిట్ గా కనిపిస్తున్నాడు. రష్మిక - విజయ్ జిమ్ ఫొటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.