Advertisement
Google Ads BL

కార్తీక దీపం: అన్నంత పని చేసిన మోనిత


ఇది ఈ  రోజు కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్ లో జరగబోయే కథ. డాక్టర్ బాబు కార్తీక్ మోనిత హత్యారోపణలతో జైల్లో ఉండగా.. దీప కార్తీక్ ని మోనిత హత్య కేసు నుండి బయట పడేసేందుకు డ్రైవర్ అంజి తో కలిసి ప్రయత్నాలు ప్రారంభించగా.. మోనిత శత్రువు దుర్గ దీప కంట పడతాడు. దీప జరిగింది దుర్గ కి చెప్పగా.. దుర్గా మోనితపై మరింత కోపాన్ని పెంచుకుంటాడు. మోనితని వెతకడానికి తన వంతు సాయం చెయ్యడానికి దుర్గ కూడా ముందుకు వస్తాడు. ఇక మోనితకి సహాయం చేసే కానిస్టేబుల్ రత్న సీత తన ఉద్యోగం పోతుంది అని భయపడుతుంది. ఎప్పుడో మోనిత తన అక్కకి సహాయం చేసిన కారణముగా ఇప్పుడు మోనితకి ఆమె సహాయం చేస్తుంది. అయితే తాను కార్తీక్ ని ఎంతగా ప్రేమించానో చెప్పిన మోనిత కానిస్టేబుల్ ఉద్యోగానికి గ్యారెంటీ ఇస్తుంది. అంతేకాదు.. జాబ్ పోయినా తన హాస్పిటల్ లో ఉద్యోగం ఇస్తా అని హమి ఇస్తుంది.

Advertisement
CJ Advs

కానిస్టేబుల్ సీత అక్కడినుండి వెళ్లిపోగా.. రేపు తెల్లారేలోపు దీప బ్రతుకు తెల్లారిపోతుంది అంటూ గన్ తీసుకుని దీప వెళ్లిన గుడికి వెళుతుంది. మరోపక్క  ఏసిపి రోషిని కార్తీక్ మీద అడుగడుగునా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రోషిణి మోనితను చంపిన గన్ సౌందర్యదే అంటూ.. అందులో మరో బుల్లెట్ గురించి మాట్లాడుతూ.. మరో 24 గంటల్లో ఆ బుల్లెట్ ఇవ్వమని లేదంటే మిమ్మల్ని కూడా అరెస్టు చేయవలసి వస్తుందని కార్తీక్ తల్లి సౌందర్యకి డెడ్ లైన్ ఇస్తుంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో గుడికి వచ్చిన దీపను మోనిత తన వెంట తెచ్చుకున్న గన్ తో షూట్ చేస్తుంది.

Karthika Deepam today episode:

karthika deepam serial today episode
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs