Advertisement
Google Ads BL

గాడ్ ఫాదర్ గా చిరు


బాలకృష్ణ - బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ మూవీగా మొదలైన BB3 కి మొదట్లో గాడ్ ఫాదర్ టైటిల్ పెట్టబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ తీరా ఆ సినిమాకి అఖండ అని టైటిల్ పెట్టేసారు. ఇప్పుడు ఆ గాడ్ ఫాదర్ టైటిల్ తో చిరు దిగిపోయారు. చిరంజీవి.. మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్న మలయాళ రీమేక్ లూసిఫెర్ సినిమాకి గాడ్ ఫాదర్ టైటిల్ ని పెట్టేసారు. మలయాళంలో, మోహన్ లాల్ లూసిఫెర్ గా అదరగొట్టేస్తే.. ఇప్పుడు మెగాస్టార్ గాడ్ ఫాదర్ గా ఇరగదియ్యబోతున్నారు. 

Advertisement
CJ Advs

రేపు మెగాస్టార్ చిరు బర్త్ డే స్పెషల్ గా చిరు 153 టీం.. చిరు 153 టైటిల్ ని రివీల్ చేసింది. టైటిల్ పోస్టర్ లో మెగాస్టార్ బ్యాక్ లుక్ లో గన్ పట్టుకుని నిజంగానే టైటిల్ కి తగ్గట్టుగా గాడ్ ఫాదర్ లుక్ లో కనిపిస్తున్నారు. మోహన్ రాజా.. చిరు ని గాడ్ ఫాదర్ గా అదిరిపోయేలా చూపించబోతున్నాడని ఈ టైటిల్ తోనే రివీల్ అయ్యింది. ప్రస్తుతం గాడ్ ఫాదర్ షూటింగ్ చిత్రీకరణలో భాగంగా చిరు ఖైదీగా జైలు లో ఉన్న సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు. ఇక చిరు 153 అప్ డేట్ వచ్చెయ్యగా.. మెగా ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక ఆచార్య, మెహర్  రమేష్, బాబీ మూవీ అప్ డేట్ కోసం మెగా ఫాన్స్ వెయిటింగ్ లో ఉన్నారు. 

Chiranjeevi to show power as God Father:

Chiranjeevi as God Father
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs