టాలీవుడ్ లో మా ఎన్నిలకల టాపిక్ రోజు రోజుకి హీట్ పెంచేలా మారుతుంది. మా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేవరకు కామ్ గా ఉండాలని అన్నప్పటికీ.. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు లు ట్విట్టర్ ద్వారా మా ఎన్నికల విషయాన్ని ఇంకా ఇంకా హీట్ పెరిగేలా చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా మా ఎన్నికల ద్వారా విషయాన్నీ కదుపుతుంటే... మంచు విష్ణు వీడియో బైట్స్ ద్వారా మా ఎన్నికల విషయాన్నీ కెలుకుతున్నారు.
తాజాగా మంచి విష్ణు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మా కల త్వరలో నెరవేరనుంది అంటూ ట్విట్టర్ లో ఓ వీడియో షేర్ చేసాడు. మా కి శాశ్వత భవనం ఉండాలనేది అసోసియేషన్‌లో ఉన్న సభ్యులందరి కల అని.. అదే ఎజెండా తో మా ఎన్నికలు మొదలవుతున్నాయని, త్వరలోనే ఆ కల నెరవేరబోతోంది అని అంటున్నారు మంచు విష్ణు. మా భవనము కోసం మూడు స్థలాలను పరిశీలించా అని, వాటిల్లో మా భవనం నిర్మించాలనే దానిపై త్వరలోనే అందరం కలిసి ఓ నిర్ణయం తీసుకుంటామని.. మంచి ఆ వీడియో ద్వారా అందరికి షేర్ చెయ్యడంతో.. మరోసారి మా ఎన్నికలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.