Advertisement
Google Ads BL

సమంత రాజి కేరెక్టర్ కి బెస్ట్ పెరఫార్మెన్స్ అవార్డు


ఎప్పుడూ గ్లామర్ షో చేసే సమంత.. పెళ్లి తర్వాత పెరఫార్మెన్స్ ఓరియెంటెడ్ కేరెక్టర్స్ తో అదరగొట్టేస్తుంది. ఇక బాలీవుడ్ లో తెరకెక్కిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 సమంత అక్కినేని పెరఫార్మెన్సు తో LTTE తీవ్రవాదిగా ఇంకా అదరగొట్టేసింది. ఫ్యామిలీ మ్యాన్ 2 లో మనోజ్ బాజిపేయి కి సమానమైన రాజి కేరెక్టర్ లో సమంత లుక్స్, ఆమె నటన అన్ని సౌత్ ప్రేక్షకులనే కాదు.. హిందీ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఫ్యామిలీ మ్యాన్ 2 రిలీజ్ అయ్యాకా సమంత కేరెక్టర్ చూసిన వారికి ఈసారి వెబ్ సీరీస్ అవార్డ్స్ కేటగిరిలో సమంత కి అవార్డ్స్ ఫిక్స్ అన్నట్టుగానే ఇప్పుడు సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 రాజి కేరెక్టర్ కి ఓ అవార్డు వచ్చేసింది. 

Advertisement
CJ Advs

వెబ్ సీరీస్ లకి, ఫిలిమ్స్ కి, షార్ట్ ఫిలిమ్స్ కి, ఫీచర్ ఫిలిమ్స్ లో బెస్ట్ కేటగిరీస్ లో అవార్డ్స్ ప్రధానం చేసే ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ మెల్బోర్న్ 2021 కి గాను ఫ్యామిలీ మ్యాన్ 2 లో అద్భుతమైన పెరఫార్మెన్స్ ఇచ్చిన సమంత కి బెస్ట్ పెరఫార్మెన్స్ ఫిమేల్ అవార్డు వరించింది. ఈ విషయాన్నీ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ మెల్బోర్న్ వారి అధికారికంగా ప్రకటించడంతో.. సమంత ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ కి, తనకి అవార్డు ఇచ్చిన ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ మెల్బోర్న్ వారికీ థాంక్స్ చెప్పుకుంది. తనకి అంత  అద్భుతమైన రోల్ ఇచ్చిన ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ రాజ్ అండ్ డీకే లకు సమంత స్పెషల్ థాంక్స్ చెప్పింది. 

Best Performance Female lead Samantha Akkineni for Family man 2:

Indian Film Festival of Melbourne announces Samantha as the winner for Best performance female
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs