త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 5 మొదలు కాబోతుంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమోస్ తో షో పై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 5 ఈనెల చివరి వారంలో కానీ.. వచ్చే నెల మొదటి వారంలో కానీ స్టార్ మా లో మొదలు కాబోతుంది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ 5 కి వెళ్లే కంటెస్టెంట్స్ విషయంలో అందరిలో ఆసక్తి మొదలైపోయింది. బిగ్ బాస్ సీజన్ 5 అనుకున్నప్పటి నుండే చాలామంది పేర్లు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. తాజాగా బిగ్ బాస్ సీజన్ 5 హౌస్ లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే అంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అందులో యాంకర్ రవి, సిరి, ఆర్జే కాజల్, శ్వేతా వర్మ, లహరి, కమెడియన్ లోబో, నటి ప్రియా, సీరియల్ నటి ఉమా దేవి, సీరియల్ నటుడు సన్నీ, హీరో కం టివి ఆర్టిస్ట్ మానస్ షా, విశ్వా, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, టీవీ 9 యాంకర్ ప్రత్యూష, ఇంకా డాన్స్ మాస్టర్ రఘు, సందీప్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. మరి ఫైనల్ గా వీళ్ళలో ఎంతమంది బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడతారో షో మొదలయ్యేవరకు సస్పెన్స్ .