Advertisement
Google Ads BL

టీడీపీకి గోరంట్ల షాక్


టిడిపిసి సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి టిడిపికి షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. గత కొన్నాళ్లుగా టిడిపి పార్టీకి రాజీనామా చేస్తారని వస్తున్న ప్రచారంపై గోరంట్ల తాజాగా స్పందించారు. టిడిపికి మీరు రాజీనామా చేస్తున్నారని జరుగుతున్న ప్రచారం నిజమేనా..  అని మీడియా అడిగిన ప్రశ్నకు.. ఆ విషయంపై ఇప్పుడేమీ మాట్లాడబోనని మాత్రం గోరంట్ల చెప్పారు.

Advertisement
CJ Advs

ప్రస్తుతం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్బావం నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీలో ఉన్నారు. పార్టీ అధిష్టానం చంద్రబాబు, లోకేష్ వైఖరి పట్ల గతకొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. పార్టీకి భవిష్యత్ లేదని భావించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు కు లేఖ రాసినట్లు సమాచారం. ఇప్పటి వరకు 6 సార్లు తెదేపా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. ఇప్పుడు టిడిపి ప్రతిపక్షంలో ఉండగా ఆయన ఉప సభానాయకుడిగా ఉన్నారు. 

Gorantla Butchaiah Chowdary likely to resign TDP:

Gorantla Butchaiah Chowdary GoodBye To TDP?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs