Advertisement
Google Ads BL

చేతులెత్తేసిన నాని


నాని టక్ జగదీశ్ ఓటిటి అంటూ ప్రచారం జరుగుతన్నా టక్ జగదీశ్ మేకర్స్ మాత్రం స్పందించడం లేదు. ఇక నిన్న లవ్ స్టోరీ రిలీజ్ డేట్ రావడంతో అందరూ నాని టక్ జగదీశ్ థియేట్రికల్ రిలీజ్ ఎప్పుడు అంటూ సోషల్ మీడియాలో హడావిడివి మొదలు పెట్టడంతో నాని లైన్ లోకొచ్చి ఓ లెటర్ ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. అది ఏమిటంటే.. టక్ జగదీశ్ మత్రమే కాదు.. నాకు థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ అవడం అంటే పిచ్చి. ఫ్రైడే ఫస్ట్ షో థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాలు చూడాలంటె ఇష్టం. నాకు థియేట్రికల్ రిలీజ్ అంటేనే ఇష్టం. 

Advertisement
CJ Advs

కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో సినిమాలను థియేటర్స్ లో రిలీజ్ చెయ్యడం అంటే చాలా కష్టము. అయినా టక్ జగదీశ్ విషయంలో మేకర్స్ నిర్ణయమే ఫైనల్. నాదేం లేదు. మేకర్స్ నిర్ణయం ప్రకారమే టక్ జగదీశ్ రిలీజ్ ఉంటుంది. బడ్జెట్ పెట్టింది వాళ్ళు, ఇబ్బందులు పడింది వాళ్ళు.. సో వాళ్ళు టక్ జగదీశ్ ని థియేటర్ రిలీజ్ చెయ్యాలా? లేదంటే ఓటిటి రిలీజ్ చెయ్యాలో వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. నాదేం లేదు అంటూ టక్ జగదీశ్ రిలీజ్ విషయంలో కన్ఫ్యూషన్ క్రియేట్ చేసి...  తనదేం లేదు అంటూ చేతులెత్తేశాడు. ఆల్మోస్ట్ నాని కూడా టక్ జగదీశ్ రిలీజ్ ఓటిటి అంటూ అలా లెటర్ తో కన్ఫర్మ్ చేసేసాడు. 

Nani washes off his hands:

Confused Nani at the crossroads
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs