బాలీవుడ్ సీనియర్ నటి కత్రినా కైఫ్ తో కుర్ర హీరో విక్కీ కౌశల్ డేటింగ్ చేస్తూ.. ప్రేమ పక్షుల్లా విహరిస్తున్న విషయం తెలిసిందే. కత్రినా ఇంటి దగ్గర ఫోటో గ్రాఫర్స్ కి విక్కీ కౌశల్ చాలాసార్లు దొరికిపోయాడు కూడా.. లాక్ డౌన్ లో కత్రినా ఇంటి దగ్గరే విక్కీ కౌశల్ ఎక్కువగా కనిపించేవాడు. ఇక విక్కీ కౌశల్ - కత్రినా పెళ్లి చేసుకోబోతున్నారంటూ మొన్న ఆ మధ్యన ఓ బాలీవుడ్ నటుడు కన్ ఫర్మ్ చేసాడు కూడా. అయితే తాజాగా విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ లు సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఎప్పటినుండో డేటింగ్ లో ఉన్న విక్కీ కౌశల్ - కత్రినాలు ఎవరికీ తెలియకుండా నిశ్చితార్ధం చేసుకున్నారని అంటున్నారు. కత్రినా -విక్కీ కౌశల్ లు ఎంగేజ్మెంట్ చేసుకున్నారని, ఇద్దరికీ రోక వేడుకలు జరిగాయని అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దానితో అభిమానులు కత్రినాకు, విక్కీ కౌశల్ కి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలపడం హాట్ టాపిక్ కాగా.. ఇదంతా రూమర్ అంటూ కొట్టిపారేస్తున్నారు కొందరు.. మరోపక్క కత్రినా పిఆర్ టీం తో పాటుగా విక్కీ కౌశల్ తండ్రి కూడా కత్రినాకి - విక్కీ కౌశల్ కి మధ్యన ఎలాంటి ఎంగేజ్మెంట్ జరగలేదని.. ఇది జస్ట్ రూమర్ అంటూ కొట్టి పారేస్తున్నారు.