Advertisement
Google Ads BL

క్రేజీ అంకుల్స్ పై కాంట్రవర్సీ


రేపు విడుదల కాబోతున్న క్రేజీ అంకుల్స్ సినిమా మహిళలను కించ పరిచే విధంగా రూపొందించారంటూ.. క్రేజీ అంకుల్స్ సినిమా విడుదలను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ మహిళ హక్కుల వేదిక అధ్యక్ష కార్యదర్శులు రేఖ, రత్నాలు డిమాండ్ చేస్తున్నారు.  క్రేజీ అంకుల్స్ సినిమా ట్రైలర్ లోనే మహిళలను కించ పరిచే సన్నివేశాలు ఉన్నాయని వారు ఆరోపించారు, మహిళలను ఆట వస్తువు గా చూపిస్తూ, అసభ్య పద జాలంతో కూడిన సినిమా రూపిందించడం సరికాదు.. కేవలం ట్రైలర్ లోనే అంత అసభ్యత ఉంటే ఇక సినిమా మొత్తం ఎలా ఉంటుందో ఊహించవచ్చు..  

Advertisement
CJ Advs

క్రేజీ అంకుల్స్ సినీ నిర్మాత, దర్శకులు, నటీనటులు యావత్ మహిళ లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పి ఈ సినిమా విడుదలను నిపివేయాలని వారు హెచ్చరించారు.. లేకుంటే యావత్  తెలుగు రాష్ట్రాల మహిళ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని రేఖ, రత్నాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

క్రేజీ అంకుల్స్ ట్రైలర్ లో భార్యలు చూడడానికి తప్ప… ఎక్కడానికి  పనికిరారు అనేడైలాగ్ ఉంది.. అంటే వీళ్ల ఉద్దేశ్యం భార్యలను అవమానించడమా.. అసలు దీనిని మహిళలు దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి.. సంసారం చేసే మహిళల పట్ల ఇలాంటి డైలాగులు చేయడం ఎంతవరకు న్యాయం.. ఈ సినిమాలో ఓ అంకుల్ పాత్ర పోషిస్తున్న సింగర్ మనో గారంటే.. ఇప్పటిదాకా అభిమానం ఉంది. ఎస్పీ బాలుగారి తర్వాత తెలుగుపాటకి పెద్ద దిక్కుగా అవుతారని భావించాం.. కానీ, ఆయన ఈ సినిమాలో నటించి బూతులకి పెద్ద దిక్కుగా మారేలా కనిపిస్తున్నారు.. అడల్ట్ కామెడీ షో గా ముద్రపడిన జబర్దస్త్ లో ఆయన చేసే డైలాగులు అన్నీ చూస్తున్నాం.. ఇలాంటి పాత్రలు ఆయన ఎలా చేస్తారు.

ఇక ఈ సినిమాలో ఒక్క రాత్రి కోసం 50 లక్ష రూపాయలు ఖర్చు అయినా పర్లేదు.. ఎవరండీ ఈ డైలాగులు రాసింది..  మహిళలను ఇంత విలాస వస్తువులుగా చూపిస్తారా.. ఇలాంటి నిర్మాతలు డైరెక్ట్ గా ముసుగులో ఇలాంటి బూతు సినిమాలు పబ్లిక్ గా తీసి రిలీజ్ చేస్తారా.. 

దర్శకుడు ఈ. సత్తిబాబుకి మంచి పేరుంది. ఇప్పటిదాకా ఆయన ఫ్యామిలీ కలిసి కూర్చునే కామెడీ పండించాడు. తాజాగా ఆయన అడల్ట్ కామెడీ చేస్తున్నాడు.. ఆయన జబర్దస్త్ లాంటి షోలని డైరెక్ట్ చేసుకోమని చెప్పండి.. ఇలాంటి సినిమాలు తీసి సమాజాన్ని చెడగొడతారా... అంటూ మహిళా సంఘాలు క్రేజీ అంకుల్స్ సినిమాపై మండిపడుతున్నారు. 

Controversy On Sreemukhi Crazy Uncles Movie:

Sreemukhi Crazy Uncles movie in controversy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs