Advertisement
Google Ads BL

మార్చుకోవడం బండ్లకి అలవాటే


రాజకీయాల్లో కామెడీ చేసి నిజంగానే కామెడీ అయిన బండ్ల గణేష్ తర్వాత మళ్ళీ సినిమా నిర్మాణంపై దృష్టి పెట్టడమే కాదు.. కామెడీని వదిలేసిన చానళ్లకు మళ్ళీ కమెడియన్ గా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈమధ్యన పవన్ తో సినిమా నిర్మిస్తా అంటూ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేయ్యడమే కాదు.. పవన్ గురించి స్టేజ్ మీది కెళ్ళి మాట్లాడాడు అంటే.. ఇక ఆపకుండా దంచికొడతాడు. బండ్ల ముందు పవన్ హార్డ్ కొర్ ఫాన్స్ కూడా సరిపోరు.. వదలమన్నా మైక్ వదలకుండా పవన్ గురించి స్పీచ్ దంచేస్తాడు. ఇక తాజాగా సోషల్ మీడియా నుండి వైదొలుగుతున్నట్టుగా ట్వీట్ చేసి ఫాన్స్ కి షాకిచ్చాడు బండ్ల గణేష్. 

Advertisement
CJ Advs

ఎలాంటి కాంట్రవర్సీల జోలికి వెళ్ళాలి అనుకోవడం లేదు.. వివాదాలకు దూరంగా వుండాలనుకుంటున్నట్లుగా చెప్పి సోషల్ మీడియాకి బై బై చెప్పిన బండ్ల గణేష్.. మళ్ళీ సోషల్ మీడియాకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అంటే బండ్ల గణేష్ మనసు మార్చుకుని సోషల్ మీడియాలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. పవన్ ఫాన్స్, ఆయన ఫాన్స్ మీరు ట్విట్టర్ లో ఉండాలి సర్ అని అంటుంటే.. బండ్ల గణేష్ కూడా ఓ జర్నలిస్ట్ కోరిక మేరకు మళ్ళీ సోషల్ మీడియాలోకి రీ ఎంట్రీ ఇచేసాడు. ఇక పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ లుక్ అదుర్స్ అంటూ పోస్ట్ చేసిన బండ్ల గణేష్ కి ఫాన్స్ వెల్ కమ్ బండ్లన్నా అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. 

Bandla Ganesh steps back:

Bandla Ganesh re - entry in Social Media 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs