Advertisement
Google Ads BL

శిల్పా శెట్టి: ఎన్నాళ్లకెన్నాళ్లకు


గత నెల 19 న నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అస్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం ముంబై పోలీస్ కష్టడీలో ఉన్నాడు. రాజ్ కుంద్రా కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తుంది. బెయిల్ కోసం రాజ్ కుంద్రా చెయ్యని ప్రయత్నాలు లేవు. కానీ కోర్టు రాజ్ కుంద్రా కేసులో బెయిల్ మంజూరు చెయ్యడం లేదు. ఇక రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత శిల్పా శెట్టి మానసికంగా కృంగిపోయింది. మీడియాలో వస్తున్న వార్తలకు బాగా డిస్టర్బ్ అయిన శిల్ప శెట్టి మీడియా మీద కోర్టుకి కూడా వెళ్ళింది. శిల్పా శెట్టి ని కూడా ముంబై పోలీస్ లు విచారించడం, ఆమె చేస్తున్న యాడ్స్ అన్ని ఆమె చేజారి పోయి.. ఆర్థికంగానూ శిల్పా శెట్టి లాస్ అయ్యింది. 

Advertisement
CJ Advs

అలాగే సూపర్ డాన్సర్ 4 కి వన్ అఫ్ ద జెడ్జి గా ఉన్న శిల్ప శెట్టి.. ఆ షో లో కాస్ట్లీ జెడ్జి గా కొనసాగుతుంది. రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత శిల్పా శెట్టి ఆ షో కి హాజరవడం లేదు. శిల్పా శెట్టి ప్లేస్ లో మరికొందరు బాలీవుడ్ స్టార్స్ గెస్ట్ లుగా వస్తున్నారు. ఇక ఈ షో నుండి శిల్పా శెట్టి ఆల్మోస్ట్ తప్పుకుంది అనుకునేలోపు మూడు వారల తర్వాత శిల్పా శెట్టి సూపర్ డాన్సర్ 4 సెట్స్ లో మెరిసింది. శిల్ప శెట్టి డాన్స్ షో కి మరలా హాజరవడం పట్ల మేకర్స్ చాలా సంతోషంగా ఉన్నారు. భర్త అరెస్ట్ తో కుంగిపోకుండా.. తన పిల్లల భవిష్యత్తు కోసం శిల్పా శెట్టి.. ఇలా బయటికి వచ్చి ఆ షో కి హాజరవుతుంది అని అంటున్నారు. ప్రస్తుతం శిల్పా శెట్టి సూపర్ డాన్సర్ 4 కి హాజరైన వీడియోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. 

Shilpa Shetty returns to Super Dancer 4 sets:

Shilpa Shetty is Back on The Super Dancer 4 Sets After Raj Kundra Arrest
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs