Advertisement
Google Ads BL

వైష్ణ‌వ్ తేజ్‌-ర‌కుల్ ప్రీత్ సింగ్‌ ఫ‌స్ట్ లుక్..


తొలి చిత్రం ఉప్పెన‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన మెగా సెన్సేష‌న్ వైష్ణ‌వ్ తేజ్‌.. ఇప్పుడు త‌న రెండో సినిమా విడుద‌ల కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. జెట్ స్పీడ్‌, ఎక్స‌లెంట్ క్వాలిటీ, డిఫ‌రెంట్ కంటెంట్‌తో సినిమాలు చేసే క్రియేటివ్ డైరెక్ట‌ర్ క్రిష్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇందులో వైష్ణ‌వ్ తేజ్ జోడీగా న‌టించారు.

Advertisement
CJ Advs

సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన నవలను ఆధారంగా చేసుకుని ఈ అడ్వెంచరస్ మూవీని రూపొందిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్ సినిమాటోగ్రాఫ‌ర్‌. ఈ సినిమా నుంచి ఓ వీడియోను చిత్ర యూనిట్ బుధ‌వారం విడుద‌ల చేసింది. ఈ ప్ర‌మోష‌న‌ల్ వీడియోలో సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్‌ను ఆగ‌స్ట్ 20 ఉద‌యం 10 గంట‌ల 15 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర‌యూనిట్ తెలియ‌జేసింది.

ప్ర‌మోష‌న‌ల్ వీడియోను గమనిస్తే కొంతమంది అడవిలో నడుచుకుంటూ వెళుతున్నారు. అంటే సినిమా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతుందని అర్థ‌మ‌వుతుంది. వి.ఎస్‌.జ్ఞాన‌శేఖ‌ర్ విజువ‌ల్స్ చాలా ప్లెజెంట్‌గా క‌నిపిస్తున్నాయి. కీర‌వాణి బ్యాగ్రౌండ్ స్కోర్ ఆక‌ట్టుకుంటోంది. కీర‌వాణి సంగీతం, నేప‌థ్య సంగీతంతో పాటు జ్ఞాన‌శేఖ‌ర్ కెమెరా వ‌ర్క్ సినిమాకు మేజ‌ర్ ఎసెట్‌గా నిల‌వ‌నుంది.

Panja Vaisshnav Tej, Rakul Preet Singh, Krish Production No 8 Title & First Look On Aug 20:

<span>Panja Vaisshnav Tej, Rakul Preet Singh, Krish and First Frame Entertainments Production No 8 Title &amp; First Look On Aug 20</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs