సెకండ్ వేవ్ ముగిసాక చాలా సినిమాల రిలీజ్ డేట్స్ కోసం ఆయా హీరోల ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. అందులో ముఖ్యంగా అన్ని కార్యక్రమాలు ముగించుకుని, ఆఖరికి ప్రమోషన్స్ కూడా పూర్తి చేసుకున్న నాగ చైతన్య లవ్ స్టోరీ గురించి అక్కినేని ఫాన్స్ తో పాటుగా, సాయి పల్లవి ఫాన్స్, శేఖర్ కమ్ముల ఫాన్స్ అందరూ కాచుకుని కూర్చున్నారు. థియేటర్స్ ఓపెన్ అయ్యాయి.. రిలీజ్ డేట్ ఇవ్వండి అంటూ మేకర్స్ వెంట పడుతున్నారు. ఇక ఇండస్ట్రీ పెద్దలు ఆంధ్ర లో థియేటర్స్ సమస్యలు, టికెట్ రేట్స్ పరిష్కారానికి ముందులు రావడంతో లవ్ స్టోరీ మేకర్స్ కూడా తమ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.
నాగ చైతన్య - సాయి పల్లవి కాంబోలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన క్రేజీ ఫిలిం లవ్ స్టోరీ ని సెప్టెంబర్ 10 వినాయకచవితి కానుకగా విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ముందునుండి ప్రచారం జరిగినట్టుగానే.. లవ్ స్టోరీ వినాయక చవితికి రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసారు. సెకండ్ వేవ్ ముగిసాక మీడియం బడ్జెట్ మూవీస్ లో ముందుగా రిలీజ్ అవుతున్న ఫిలిం లవ్ స్టోరీ కావడంతో ఇప్పుడు ప్రేక్షకులందరిలో లవ్ స్టోరీ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక థియేటర్స్ ఓపెన్ అయ్యాక ఇప్పటివరకు చిన్న చిన్న లో బడ్జెట్ మూవీస్ మాత్రమే రిలీజ్ అవుతున్నాయి.. అందులో మొదటగా లవ్ స్టోరీ క్రేజ్ ఉన్న ఫిలిం గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.