Advertisement
Google Ads BL

టీఎస్ గవర్నర్ తమిళిసై కి మాతృ వియోగం


తెలంగాణ గవర్నర్ తమిళిసై తల్లిగారు శ్రీమతి కృష్ణ కుమారి ( 77) అనారోగ్యంతో ఈరోజు  ఉదయం  సోమాజీగూడ  యశోద  ఆస్పత్రిలో పరమపదించారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆవిడా ఈ రోజు ఉదయమే కన్ను మూసారు.  

Advertisement
CJ Advs

ఈరోజు మధ్యాహ్నం వరకు పార్థివ శరీరం రాజ్ భవన్ లో ఉంచుతారు. తర్వాత ఆంత్యక్రియల కోసం కృష్ణ కుమారి పార్థివదేహాన్ని చెన్నై తరలిస్థారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాతృమూర్తి  మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.  గవర్నర్ కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శ్రీమతి కృష్ణకుమారి మృతి పట్ల ఆర్థిక మంత్రి టి. హరీశ్ రావు గారు సంతాపం వ్యక్తం చేశారు.. తల్లి మరణంతో శోక సముద్రంలో ఉన్న గవర్నర్ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు.

కృష్ణ కుమారి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారురాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ గారి మాతృమూర్తి కృష్ణకుమారి గారి మృతి పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  సంతాపం ప్రకటించారు. కృష్ణకుమారి గారి ఆత్మకు శాంతి చేకూరాలని, శోకసంద్రంలో ఉన్న గవర్నర్ గారి కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్ధించారు.  ప్రముఖులు గవర్నర్ తమిళిసై తల్లి మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. 

Governor Tamilisai Soundararajan mother passes away:

TS Governor Tamilisai Soundararajan mother passes away
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs