ఈ రోజు కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ పుట్టిన రోజు. సోషల్ మీడియా వేదికగా శంకర్ కి బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఆయన కోలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు తెరకెక్కించారు. స్టార్ హీరోస్ విజయ్, విక్రమ్, రజినీకాంత్, కమల్ హసన్ ఇలా చాలామందితో వర్క్ చేసిన శంకర్ ఇప్పడు తెలుగు స్టార్ హీరో, పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ తో మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో సినిమా చెయ్యబోతున్నాడు. అది కూడా టాలీవుడ్ ప్రొడ్యూసర్ తో. ఇక ఆల్మోస్ట్ తెలుగు టెక్నీకల్ టీం నే శంకర్ RC15 కోసం ఎంపిక చేస్తున్నారు.
తాజాగా శంకర్ బర్త్ డే రోజున RC15 ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపగా.. RC15 హీరో రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కి స్వీట్ గా విష్ చెయ్యడం మాత్రమే కాదు.. త్వరలోనే RC15 సెట్స్ లో కలుద్దామంటూ శంకర్ తో దిగిన పిక్ ని సోషల్ మీడియాలో.. Happy Birthday @shankarshanmugh Sir! Wishing you a great year ahead.Looking forward to seeing u soon on the sets of #RC15! అని పోస్ట్ చెయ్యడంతో మెగా ఫాన్స్ కి ఎక్కడా ఆగడం లేదు. ఎందుకంటే రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ ముగియగానే.. సెప్టెంబర్ నుండి RC15 మొదలు కాబోతుంది.