Advertisement
Google Ads BL

కాస్త డైవర్ట్ అయిన శిల్పా శెట్టి


శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ఇంకా ముంబై పోలీస్ కష్టడీలోనే ఉన్నాడు. కోర్టులో ఆయన వేసిన బెయిల్ పిటిషన్స్ అన్ని రద్దవుతున్నాయి. అస్లీల చిత్రాల కేసులో రాజ్ కుంద్రా కేసు ముంబై కోర్టులో ఉంది. ఆయన ముంబై పోలీస్ కష్టడీలో ఉన్నాడు. అయితే భర్త అరెస్ట్ విషయంలో మానసికంగా క్షోభ అనుభవిస్తున్న శిల్ప శెట్టి నేను కొన్నాళ్లుగా ఎంతో కుంగిపోతున్నాను. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్నాను.. కనీసం నా ఫ్యామిలీని అయినా వదిలెయ్యండి.. ఎలాంటి రూమర్స్ సృష్టించవద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించిన శిల్పా శెట్టి తాజాగా భర్త అరెస్ట్ తర్వాత కాస్త కుదుటపడినట్లుగా కనిపిస్తుంది. 

Advertisement
CJ Advs

అటు కెరీర్ లో భారీ లాస్ అయిన శిల్ప శెట్టి.. యోగ శిక్షణ ఇస్తుంది. లేటెస్ట్ గా శిల్ప శెట్టి వర్చవల్ మాద్యమంలో ఆమె తన ఫ్యాన్స్‌కి యోగాలో శిక్షణ ఇచ్చింది. ఈ యోగ శిక్షణలో శిల్పా శెట్టి మాట్లాడుతూ.. ప్రాణాయామం ఎంతో బలం ఇస్తుంది.. ఇక మన మనస్సు ఎలా ఆలోచిస్తుందో.. వచ్చే ఫలితం కూడా అలాగే ఉంటుంది అంటూ ఆమె పేర్కొంది. మన ఆరోగ్యం బాగుండాలి అంటే నాసిక మార్గం బాగుండాలి అని పేర్కొన్న శిల్పా.. మనల్ని మనం పాజిటివ్‌గా ఉంచుకోవడం ఎంతో ముఖ్యమని చెప్పింది. అంటే భర్త అరెస్ట్ తో కుంగిపోయిన శిల్పా శెట్టి మనసు కాస్త కుదుటపడబట్టే ఇలా మంచి మాటలు చెబుతుంది అంటూ నెటిజెన్స్ శిల్పా ని మెచ్చుకుంటున్నారు. 

Shilpa Shetty Makes First Virtual Appearance After Raj Kundra Arrest:

Shilpa Shetty Makes First Virtual Appearance After Raj Kundra Arrest, Talks About Regulating Negative Thoughts
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs