Advertisement
Google Ads BL

కంప్లైంట్ చేసిన గంటలోపే..


ఈమధ్యన బడా సినిమాల షూటింగ్ స్పాట్ నుండి వీడియోస్, పిక్స్ లీకవడం అందరిలో ఆందోళన రేకెత్తిస్తుంది. తాజాగా సర్కారు వారి పాట, పుష్ప మూవీస్ కి సంబందించిన వీడియోస్ లీకవడం ఫాన్స్ లోనే కాదు.. ఆ సినిమా మేకర్స్ లోను ఆందోళన కలిగించింది. అయితే ఈ లీకులపై పుష్ప మేకర్స్ మైత్రి మూవీస్ వారు సైబర్ క్రైమ్ పోలీస్ లకి ఫిర్యాదు చేసారు. కొంతంనుండి అత్యుత్సాహం వలన ఇలాంటి లీకులు సృష్టించి పైశాచికానందం పొందుతున్నారంటూ మైత్రి మూవీ మేకర్స్ ఘాటైన వ్యాఖ్యలు చేసారు. 

Advertisement
CJ Advs

అయితే ఇలా లీకులపై ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే పుష్ప మూవీ సెట్స్ నుండి యాక్షన్ సీక్వెన్స్ లీకవడం కలకలం సృష్టించింది. అది పుష్ప లోని కీలకమైన ఫైటింగ్ సీన్ కావడం గమనార్హం. ఈ లీక్డ్ వీడియో లో అల్లు అర్జున్ స్టైలిష్ యాక్షన్‌‌తో ఫైట్ చేయడం కనిపించింది. భుజంపై కుర్చీని పట్టుకుని లుంగీ కట్టుకోవడం చూసిన అల్లు అర్జున్ ఫాన్స్ ఆగడం లేదు. ప్రస్తుతం పుష్ప నుండి లీకైన ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. 

Allu Arjun Pushpa leaked video going viral :

Allu Arjun - Sukumar Pushpa pan india movie leaked video going viral 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs