ఏప్రిల్ లో సెకండ్ వేవ్ కారణంగా మూతబడిన థియేటర్స్.. మళ్ళీ జులై 23 న తెరుచుకున్నాయి. అయినప్పటికీ.. ఆ వారం మూవీస్ ఏమీ విడుదల కాకపోయినా.. జులై 30 నుండి వరసబెట్టి సినిమా రిలీజ్ లు అవుతున్నాయి. వారం వారం సినిమాల మీద సినిమాలు థియేటర్స్ కి క్యూ కడుతున్నాయి. ప్రేక్షకుల స్పందన ఎలా ఉన్నా.. ప్రతి వారం ఏదో ఒక చిన్న కాదు.. చాలా చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. గత వారం పాగల్ తో పాటుగా మరికొన్ని సినిమాలు విడుదలయ్యాయి. ఇక ఈ వారం కూడా పొలోమంటూ చాలా సినిమాలు రాబోతున్నాయి. ఈ శుక్రవారం రిలీజ్ మూవీస్ లిస్ట్ కూడా చాలానే ఉంది. అందులో సునీల్ కనబడుట లేదు, శ్రీవిష్ణు రాజా రాజా చోర మూవీస్ కాస్త ఇంట్రెస్టింగ్ మూవీస్ మాత్రమే.. మిగతావన్నీ సో సో సినిమాలే.
సునీల్ కనబడుటలేదు ఆగష్టు 19 న రిలీజ్ అవుతుంది.
శ్రీ విష్ణు రాజా రాజా చోర మూవీ ఆగస్టు 19 న రిలీజ్ డేట్ ఇచ్చేసింది.
యాంకర్ శ్రీముఖి నటించిన క్రేజీ అంకుల్స్ కూడా ఆగష్టు 19 నే రిలీజ్ కి సిద్ధమైంది.
ఇంకా సంపూర్ణేష్ బాబు బజారు రౌడీ, తరగతి గదిలో మూవీస్ రిలీజ్ కి సిద్ధమయ్యాయి. అందులో తరగతి గదిలో ఆహా ఓటిటి నుండి నేరుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.