Advertisement
Google Ads BL

లైగర్ లో అదే హైలెట్


విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ కాంబోలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న లైగర్ షూటింగ్ అప్ డేట్ కానీ, లైగర్ సినిమా రిలీజ్ డేట్ కానీ ఇవ్వకుండా ఫాన్స్ ని కాస్త కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈమధ్యనే లైగర్ డబ్బింగ్ చెబుతూ ఫాన్స్ లో అసలు రేకెత్తించిన విజయ్ దేవరకొండ ఇంకా లైగర్ లుక్ నే ఫాలో అవుతున్నాడు. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా అదరగొట్టేస్తున్నాడు. ముందు సెప్టెంబర్ 9 రిలీజ్ అన్న టీం.. ఇప్పుడు కొత్త డేట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు లైగర్ పై ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ హైలెట్ అయ్యింది. 

Advertisement
CJ Advs

అది లైగర్ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎంత కీలకమో ప్రీ క్లైమాక్స్ సీన్ కూడా అంతే హైలైట్‌గా ఉంటుందట. కథలో అప్పటి వరకూ ఉంచిన సస్పెన్స్‌.. ఓ భారీ ఎమోషనల్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ తర్వాత రివీల్ అవుతుందని తెలుస్తోంది. ఆ ఎపిసోడ్ సినిమా మొత్తాన్నే మలుపు తిప్పే విధంగా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. దానితో విజయ్ లైగర్ మూవీ పై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే నటిస్తుంది. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తో కలిస్ ఛార్మి, పూరి లు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 

Interesting Update on Liger Movie:

Interesting Update on Vijay Deverakonda - Puri Jagannadh Liger Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs