ఒక్కప్పటి హీరో, విలన్ పాత్రధారి, ఇప్పటి కేరెక్టర్ ఆర్టిస్ట్ సాయి కుమార్ పై తెలుగు చిత్ర నిర్మాతల మండలిలో నమోదైన ఫిర్యాదు హాట్ టాపిక్ గా మారింది. కాంట్రవర్సీల జోలికి పోని నటుడు సాయి కుమార్ పై తెలుగు చిత్ర నిర్మాతల మండలి లో ఓ నిర్మాత కంప్లైంట్ చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. సాయి కుమార్ తమ వద్ద రీమేక్ రైట్స్ కొనకుండానే.. వన్ బై టు చిత్రం తెలుగులో నిర్మించారంటూ తమిళ చిత్రం దా దా 2.0 దర్శకుడు విజయశ్రీ ఆరోపిస్తున్నారు. అసలు ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేసే ముందు సినిమాకు మాత్రమే కాకుండా స్క్రిప్ట్ కి కూడా అనుమతి తీసుకోలేదు అని ఆయన చెన్నై లోని ప్రెస్ మీట్ లో ఆరోపించారు.
పెద్ద నటులు, దర్శకనిర్మాతల కష్టసుఖాలు తెలిసిన సాయి కుమార్ లాంటి పెద్ద నటుడే ఇలా చెయ్యడం బాలేదు.. కనీసం ఆ సినిమా విషయంలో మమ్మల్ని సంప్రదించలేదు. తమిళంలో వచ్చిన మా సినిమా తెలుగులో రావడం మాకు సంతోషమే. కానీ.. అనుమతులు తీసుకోకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు. తెలుగులోకి రీమేక్ చేసినందుకు మేము డబ్బులు కూడా అడగడం లేదు. మా అనుమతి తీసుకోవాలని, తెలుగు వెర్షన్ టైటిల్స్‌లో నా పేరు వేయాలన్నదే కోరిక.. అంటూ ఆయన ఈ విషయమై కోర్టు కెళ్ళి రచ్చ చెయ్యడం కూడా ఇష్టం లేదు అంటూ సెన్సార్ బోర్డు తో సహా నిర్మాతల మండలిలో సాయి కుమార్ పై ఫిర్యాదు చేసారు.