Advertisement
Google Ads BL

లీకులపై ఫిర్యాదు


ఇప్పుడు బడా సినిమాల సెట్స్ నుండి లీకులు మూవీ టీమ్స్ ని తెగ కంగారు పెడుతున్నాయి. భారీ బడ్జెట్ మూవీ సెట్స్ నుండి లీకులు నిర్మాతలను ఊపిరాడనివ్వడం లేదు. ఈమధ్యన సర్కారు వారి పాట టీజర్, అలాగే పుష్ప సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసే టైం కన్నా ముందే లీకైపోయి యూట్యూబ్ లో హడావిడి చెయ్యడంతో ఆయా చిత్ర బృందాలు.. కంగారుగా అసలు టైం కన్నా ముందే వాటిని రిలీజ్ చెయ్యాల్సి వచ్చింది. సెట్ లో ఎంత కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నా.. ఇలాంటి లీకుల వలన తలనొప్పి పెరిగిపోతుంది. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ కి ఈ లీకులు తప్పడం లేదు. ప్రభాస్ సలార్ సెట్ నుండి ఏదో ఒక లీకు బయటికి వస్తూనే ఉంది. 

Advertisement
CJ Advs

అయితే తాజాగా సర్కారు వారి పాట, పుష్ప పాన్ ఇండియా మూవీ లీకలపై ఆ సినిమాల నిర్మాణ సంస్థ స్పందించింది. ఈ రెండు సినిమాలను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్  మేము నిర్మిస్తున్న చిత్రాలకు సంబంధించిన కంటెంట్ ఆన్ లైన్ లో లీక్ కావడం నిజంగా మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. ఈ విషయాన్నీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై ఇప్పటికే పోలీస్ లకి ఫిర్యాదు చేశాం.. కొంతమంది కావాలనే ఇలా లీకులు సృష్టించి పైశాచికానందం పొందుతున్నారని, ఇలాంటి లీకుల వలన ప్రేక్షకులకు అందాల్సిన థ్రిల్ ను చంపేస్తున్నారని.. దీన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, అయితే భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని మైత్రి మూవీ మేకర్స్ తమ సినిమాల లీకులపై స్పందించింది. 

Sarkaru Vaari Paata and Pushpa Leaked: Mythri Movie makers Approaches Cybercrime:

Sarkaru Vaari Paata and Pushpa Leaks
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs