లాక్ డౌన్ లో హీరో, హీరోయిన్స్ అందరూ ఫామిలీస్ తో కలిసి టైం స్పెండ్ చేసారు. ఇక గత నెలలో సెకండ్ వేవ్ తగ్గడంతో అందరూ తమ తమ సినిమాల షూటింగ్స్ తో హైదరాబాద్ అలాగే, ఇతర ప్రదేశలకు ఫ్యామిలీలలకు దూరంగా వెళుతున్నారు. రాజమౌళి ఆధ్వర్యంలో ఆర్.ఆర్.ఆర్ టీం అయితే ఏకంగా దేశం వదిలి వెళ్ళింది. ఆర్.ఆర్.ఆర్ టీం హీరోలు, హీరోయిన్స్, దర్శకుడు అందరూ ఉక్రెయిన్ వెళ్లారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఉక్రెయిన్ లో ఆర్.ఆర్.ఆర్ సెట్స్ లో చేసే అల్లరి, సందడి ఎప్పటికప్పడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ ని కలిగిస్తున్నారు.
అయితే రామ్ చరణ్ ఉక్రెయిన్ వెళ్ళాక ఆయన వైఫ్ ఉపాసన కూడా ఉక్రెయిన్ వెళ్ళింది. అక్కడ ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ తో చరణ్ బిజీగా వున్నా.. ఉపాసన అక్కడ టూరిస్ట్ ప్లేసెస్ ని విజిట్ చేస్తూ భర్తతోనే కలిసి ఉంది. కొన్నాళ్లుగా భర్త రామ్ చరణ్ తో ఆల్మోస్ట్ ఆర్.ఆర్.ఆర్ టీం కి దగ్గరగా ఉన్న ఉపాసన ఇప్పుడు ఉక్రెయిన్ నుండి తిరిగి హైదరాబాద్ కి బయలుదేరింది. ఉపాసన సోషల్ మీడియా ద్వారా ఆర్.ఆర్.ఆర్ లోని అందరికి చీర్స్ చెబుతూ.. ఆర్.ఆర్.ఆర్ యూనిట్ తనని చాలా బాగా ట్రీట్ చేసారని, ఇలాంటి ఆదిత్యం ఎప్పుడు అందుకోలేదని, రాజమౌళి, రమా రాజమౌళి, అయన కొడుకు కోడలు, ఇలా అందరిని తలచుకుంటూ ఉపాసన ఉక్రెయిన్ నుండి హైదరాబాద్ కి బయలుదేరింది. అంటే భర్త రామ్ చరణ్ వదిలి రాలేక రాలేక ఉపాసన హైదరాబాద్ కి వచ్చేసింది.