Advertisement
Google Ads BL

వినాయక చవితికి లవ్ స్టోరీ


నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సెకండ్ వేవ్ కి ముందు విడుదల కావాల్సిన సినిమా. పోస్ట్ ప్రొడక్షన్, ఆఖరికి పబ్లిసిటి కూడా చాలా వరకు పూర్తి చేసేసుకున్న లవ్ స్టోరీ మూవీ సెకండ్ వేవ్ ఉధృతితో అద్దంతరంగా వాయిదా పడింది. సెకండ్ వేవ్ తగ్గినా, చిన్న సినిమాలు థియేటర్స్ కి క్యూ కడుతున్నా నాగ చైతన్య లవ్ స్టోరీ కి మాత్రం రిలీజ్ డేట్ ప్రకటించడం లేదు. లవ్ స్టోరీ ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటిటి కి ఇవ్వమని మేకర్స్ కాస్త గట్టిగానె పట్టుబట్టారు. అయితే ఆగస్టు లో సినిమా రిలీజ్ ఉండొచ్చనే ప్రచారం జరిగినా, ప్రస్తుతం చిన్న సినిమాల కలెక్షన్స్ చూసన్ మేకర్స్ లవ్ స్టోరీ రిలీజ్ డేట్ ఇచ్చేందుకు జంకుతున్నారు.

Advertisement
CJ Advs

అయితే తాజాగా లవ్ స్టోరీ ని ఈ నెలలో రిలీజ్ చెయ్యరని.. వచ్చే నెల అంటే సెప్టెంబర్ లో వినాయక చవితి స్పెషల్ గా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నెల థియేటర్స్ ఆక్యుపెన్సీ చూసి.. ఈ నెలాఖరున లవ్ స్టోరీ రిలీజ్ డేట్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి చైతు లవ్ స్టోరీ ని పక్కనపడేసి, థాంక్యూ మూవీ షూట్ కంప్లీట్ చేసేసి బాలీవుడ్ లో లాల్ సింగ్ చద్దా మూవీ కి షిఫ్ట్ అయ్యాడు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే చైతన్య చక్కర్లు కొడుతున్నాడు.

Love Story release on Vinayaka chavithi:

Love Story: Game-Changing Vinayaka Chaviti
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs