రామ్ చరణ్ హీరోయిన్ గా వినయ విధేయరామ లో నటించిన కియారా అద్వానీ.. ఆ దెబ్బకి టాలీవుడ్ వైపు చూడకుండా బాలీవుడ్ లో బోల్డ్ సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారింది. బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ తో ఒక్కసారిగా ఫామ్ లోకొచ్చిన కియారా అద్వానీ అక్కడ బిజీగా మారిపోయింది. పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా వున్న కియారా.. మళ్ళీ రామ్ చరణ్ మూవీతోనే సౌత్ కి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. రామ్ చరణ్ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో మూడు భాషల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా ఎంపికైంది. ఈ సినిమా కథా చర్చల టైం లో శంకర్ తో దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం కియారా బాలీవుడ్ లో నటించిన షేర్షాహ్ అమెజాన్ ప్రైమ్ నుండి అంటే ఓటిటి నుండి రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో కియారా సిద్దార్థ్ మల్హోత్రా తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది.
ఇక సిద్దార్థ్ మల్హోత్రా - కియారా ఫెమినా మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఫెమినా ఇండియా మ్యాగజైన్ పై కియారా లుక్ చూస్తే అబ్బ సూపర్ కూల్ అంటారు. ఫెమినా మ్యాగజైన్, షేర్షాహ్ మూవీ తో కియారా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రేడింగ్ లో ఉంది. అందుకే మెగా ఫాన్స్ కూడా రామ్ చరణ్ హీరోయిన్ కియారా అద్వానీ క్రేజ్ చూసారా.. ఎంత అందం, ఎంత అభినయం, వినయ విధేయరామ డిజాస్టర్ అయినా.. చరణ్ అండ్ కియారా అద్వానీ కెమిస్ట్రీ అదుర్స్, వారి మధ్యన రొమాంటిక్ యాంగిల్ సూపర్ అంటూ ఇప్పుడు కియారా ని తెగ ట్రెండ్ చేస్తున్నారు.