Advertisement
Google Ads BL

విజయ్ కి ఏం కాలేదు.. ఆందోళన వద్దు


తమిళ సీనియర్ హీరో విజయ్ కాంత్ ఈ మధ్యన తరుచు ఆసుపత్రి పాలవడంతో ఆయన ఫాన్స్ లో ఆందోళన నెలకొంది. గత కొన్నాళ్లుగా అనారోగ్య కారణాల వలన విజయ్ కాంత్ ఆసుపత్రి చుట్టూ తిరగడమే కాదు.. ఆఖరికి అమెరికా కూడా వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. గత ఏడాది కరోనా బారిన పడిన విజయ్ కాంత్ చైన్నై నందంబాక్కంలోని మియాట్ ఆసుపత్రిలో చాలా రోజులు ట్రీట్మెంట్ లో ఉన్నారు. ఇక విజయ్ కాంత్ పెట్టిన పార్టీ కూడా ఇప్పుడు మూతబడేలా కనిపిస్తుంది. ఆయన ఆనారోగ్య సమస్యలతో పార్టీ పనులు పెద్దగా పట్టించుకోవడం లేదు.

Advertisement
CJ Advs

అయితే తాజాగా మంగళవారం సాయంత్రం విజయ్ కాంత్ మరోసారి అస్వస్థతకు గురి కాగా.. ఆయన్ని చెన్నై లోని మియాట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకి అన్ని టెస్ట్ లు చేసి.. ఇంటికి పంపేసినట్లుగా తెలుస్తుంది. అయితే విజయ్ కాంత్ మరోసారి ఆసుపత్రి పాలయ్యారనగానే.. ఆయన ఫాన్స్ ఆందోళన పాడుతున్నారు. కాకపోతే విజయ్ కాంత్ కి ఏం కాలేదని, ఆయన ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారని.. కేవలం రెగ్యులర్ టెస్ట్ ల కోసమే ఆయన ఆసుపత్రికి వెళ్లారని డీఎండీకే పార్టీ ప్రకటించింది.  

Vijayakanth admitted to Miot hospital in Chennai:

Vijayakanth admitted to hospital due to regular check up
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs