అస్లీల చిత్రాల కేసులో జైలు లో ఉన్న రాజ్ కుంద్రా కేసు కోర్టులో తెగ మలుపులు తిరుగుతుంది. ప్రస్తుతం కోర్టు విచారణలో రాజ్ కుంద్రా లాయర్లు ఆయనకు బెయిల్ ఇప్పించడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిబ్రవరి నుండి నడుస్తున్న ఈ కేసులో చాలామంది అరెస్ట్ అయ్యి.. కొంతమంది బెయిల్ పై బయటికి రాగా.. రాజ్ కుంద్రాకు మాత్రం బెయిల్ దొరకడం లేదు. శిల్ప శెట్టి, రాజ్ కుంద్రా ఆర్థికలావాదేవీలు నిలిచిపోయాయి. ఇక ఇలాంటి ఈకేసులో బెయిల్ ఇస్తే వారు విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది అని ముంబై పోలీస్ లు వాదిస్తున్నారు.
ఒకవేళ అలా విదేశాలకు పారిపోయి ఈ అస్లీల చిత్రాలను విదేశాల నుండి అప్ లోడ్ చేస్తే.. అది దేశం సంస్కృతికి విఘాతం కలుగుతుంది. ఇప్పటికే ఈ కేసులో రాజ్ కుంద్రా బంధువు ప్రదీప్ భక్షి తప్పించుకు తిరుగుతూ.. సాక్ష్యాలను తారుమారు చేసే పనిలో ఉన్నాడని, రాజ్ కుంద్రా కూడా హై సొసైటీ ప్రొఫైల్ మనిషి కాబట్టి అతను ఇలాంటి వాటికీ పాల్పడవచ్చని, మహారాష్ట్ర పోలీస్ లు కోర్టుకి నివేదిక ఇచ్చారు. ఇక ఈ కేసుని ఆగష్టు 20 వరకు వాయిదా వేస్తున్నామని, ఆగష్టు 20 న మళ్ళి విచారణ చేపడతామని చెప్పడంతో రాజ్ కుంద్రా మరో పది రోజులు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.