Advertisement
Google Ads BL

అపుడు నాగ్.. ఇప్పుడు తారక్


కోలీవుడ్ సీనియర్ నటుడు విజయ్ కుమార్ పెద్ద కూతురు వనిత అంటే తెలియని వారుండరు. తెలుగులో దేవి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయం అయిన వనితా విజయ్ కుమార్.. కోలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించడమే కాదు.. ఆస్తుల విషయంలో తన తల్లితండ్రులతో గొడవల విషయం కానివ్వండి, తాను చేసుకున్న పెళ్లిళ్లు విషయం కానివ్వండి.. ఎప్పటికప్పుడు కాంట్రవర్సీలతో మీడియా కి మంచి న్యూస్ అందిస్తుంది అయితే తాజాగా ఈ నటి తెలుగులో అలీ తో సరదాగా ప్రోగ్రాం కి గెస్ట్ గా వచ్చింది.. వనిత విజయ్ కుమార్ పాల్గొన్న ఆ ఎపిసోడ్ వచ్చే సోమవారం రాబోతుంది. ఆ ఎపిసోడ్ ప్రోమో లో వనిత విజయ్ కుమార్ చాలా ముచ్చట్లే చెప్పింది.

Advertisement
CJ Advs

అందులో సీనియర్ హీరోస్ లో తనకి నాగార్జున అంటే ఇష్టమన్న వనిత విజయ్ కుమార్.. ఈ తరం హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని, తారక్ తో ఒక్క షాట్ లో అయినా నటించాలనే కోరిక ఉంది అంటూ తారక్ అంటే ఎంతిష్టమో చెప్పుకొచ్చింది. తారక్ తో ఒక్కరి అయినా, ఒక్క చిన్న షాట్ లో అయినా కనిపించాలనేది తన కల అని వనిత ఆ షోలో చెప్పుకొచ్చింది. ఇంతకుముందు ఖుష్బూ లాంటి సీనియర్ హీరోయిన్స్ కూడా ఎన్టీఆర్ తో నటించాలని, అతని పెరఫార్మెన్స్ బావుంటుంది అంటూ మెచ్చుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.

Then Nag, now Tarak:

Alitho Saradaga: From her admiration for Jr NTR to strained relationship with family, Vanitha Vijaykumar to make some shocking revelations
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs