ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో బాహుబలి కటౌట్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ షూటింగ్ సెకండ్ షెడ్యూల్ తాజాగా మొదలైంది. ఎప్పుడో ఫిబ్రవరిలోనే ఫస్ట్ షెడ్యూల్ ని గోదావరి ఖని బొగ్గుగనుల్లో చిత్రీకరించారు. మధ్యలో సెకండ్ వేవ్, ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ తో గ్యాప్ తీసుకున్న ప్రభాస్ సలార్ సెకండ్ షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఫస్ట్ షెడ్యూల్ లోనే కొన్ని రోజులు ప్రభాస్ తో షూటింగ్ చేసిన శృతి హాసన్.. ప్రభాస్ గురించి పలు ఇంటర్వూస్ లో చెప్పుకొచ్చింది. చాలా సింపుల్ గా వుండే వ్యక్తి ప్రభాస్ అని, బ్యూటిఫుల్ పర్సన్ అంటూ పొగిడిన శృతి హాసన్.. ఇప్పుడు తాజాగా సలార్ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యాక మరోసారి సలార్ పై స్పెషల్ అప్ డేట్ ఇచ్చింది. ప్రస్తుతం సలార్ షూటింగ్ ని ప్రశాంత్ నీల్ చాలా స్పీడు గా చేస్తున్నారు అని, బెస్ట్ టీం లో ఇలాంటి వండర్ ఫుల్ ప్రాజెక్ట్ లో తాను వర్క్ చెయ్యడం నిజంగా ఒక బ్లెస్సింగ్ లా ఫీల్ అవుతున్నానని.. శృతి హాసన్ సలార్ పై స్పెషల్ అప్ డేట్ ఇచ్చింది.