మహేష్ కి లైన్ నచ్చింది
గత ఏడాది నుండి మహేష్ ఇచ్చే సర్ ప్రైజెస్ కోసం ఫాన్స్ ఎంతగా వెయిట్ చేసారో అనేది ఆయన బర్త్ డే రోజున సోషల్ మీడియా లో మహేష్ ఫాన్స్ చేసిన హంగామా చూస్తే తెలుస్తుంది. మహేష్ బర్త్ డే బ్లాస్టర్ అంటూ సర్కారు వారి పాట నుండి టీజర్ రిలీజ్ చేసారు. అలాగే మహేష్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో చేస్తున్నాడు. దానికి సంబందించిన SSMB28 డిటైల్స్ రిలీజ్ చేసి ఫాన్స్ ని ఖుషి చేసారు. దానితో పాటుగా మహేష్ బాబు రాజమౌళి సినిమా గురించి మాట్లాడి ఫాన్స్ కి స్వీట్ న్యూస్ వినిపించాడు. ఇక వరస లైనప్ తో ఉన్న మహేష్ కి రాజమౌళి తర్వాత సినిమా కూడా సెట్ అయ్యేలాగే కనిపిస్తుంది.
అంటే గతంలో అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగాతో మహేష్ మూవీ ఉండబోతుంది అని అన్నా.. మహేష్ సందీప్ వంగా దగ్గర లైన్ విని అతన్ని హోల్డ్ లో పెట్టాడు. దానితో మహేష్ - సుందీప్ వంగా కాంబో మూవీ లేనట్టే అనుకున్నారు. మళ్లీ మహేష్ బర్త్ డే రోజున సందీప్ వంగా మూవీ పై చిన్న క్లారిటీ వచ్చింది. అంటే మహేష్ నుండి సందీప్ వంగా అప్ డేట్ రకయినా.. సందీప్ వంగా మాత్రం మహేష్ తో మూవీ ఉంటుంది.. నేను చెప్పిన లైన్ ఆయనకి బాగా నచ్చింది.. చర్చల దశలో కథ ఉందని చెప్పాడు. తమ కాంబినేషన్లో సినిమా తప్పకుండా ఉంటుందని చెప్పడంతో ఇప్పుడు సందీప్ కి మహేష్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడో అంటున్నారు ఫాన్స్. మరి త్రివిక్రమ్ - రాజమౌళి మూవీస్ అవ్వాలి కదా...