శ్రీ రెడ్డి పేరు వినగానే బడా నిర్మాత సురేష్ బాబు కొడుకు అభిరామ్ గుర్తుకు వస్తాడు. తనని దగ్గుబాటి అభిరామ్ వాడుకుని వదిలేసాడంటూ సెన్సేషనల్ కామెంట్స్ తో హైలెట్ అయిన నటి శ్రీరెడ్డి.. ఆ తర్వాత RGV కన్నా ఎక్కువగా కాంట్రవర్సీలని క్రియేట్ చేస్తుంది. ఎప్పటికప్పుడు వెటకారంగా స్పందించే శ్రీ రెడ్డికి సినిమా ఆఫర్స్ లేక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది. రకరకాలుగా సోషల్ మీడియాని వాడుతూ అలాగే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటే శ్రీరెడ్డి ఈ మధ్యన అంటే ఓ నెల నుండి పెద్దగా కనిపించడం లేదు.
దానితో శ్రీరెడ్డి కి కరోనా సోకింది అని, తీవ్ర అనారోగ్యంతో శ్రీరెడ్డి బాధపడుతుంది అంటూ వార్తలు రావడంతో స్పందించిన శ్రీ రెడ్డి.. తనకి కరోనా రాలేదు అని, కాకపోతే కాస్త డిప్రెషన్ లో ఉండిపోయాను అని, తన ఫ్రెండ్స్ ఇద్దరు డిప్రెషన్ తో సూయిసైడ్ చేసుకున్నారని, తాను డిప్రెషన్ తో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అని, లాక్ డౌన్ వలన అందరూ దాదాపుగా ఇలానే సఫర్ అవుతున్నారని, అలాగే చెన్నై లో తాను ఇల్లు మారడం వలనే పేస్ బుక్ కి దూరంగా ఉన్నాను అని తన అనారోగ్య కారణాలను వివరించింది శ్రీరెడ్డి.