Advertisement
Google Ads BL

అల్లు అర్జున్ ని ఫాలో అవుతున్న నాగ చైతన్య


అల్లు అర్జున్ టాలీవుడ్ టాప్ స్టార్. అయితే అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప మూవీ తో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నా.. ఆయనకి అంతకుముందే బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. కారణం అల్లు అర్జున్ యాక్షన్ మూవీస్ హిందీ యూట్యూబ్ లో భారీ హిట్స్. అంతేకాదు.. అల్లు అర్జున్ కూడా బాలీవుడ్ లో తన క్రేజ్ పెంచుకోవడానికి ఓ పిఆర్ టీం ని మెయింటింగ్ చేస్తున్నాడు. అందుకే అల్లు అర్జున్ ముచ్చట బాలీవుడ్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది. అలాగే బాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్ డాన్స్ ని బాగా లైక్ చెయ్యడం, దానిని ఓపెన్ గా చెప్పడంతో ఆయన పేరు బాలీవుడ్ మీడియా లో బాగా చక్కర్లు కొడుతోంది. అయితే తాజాగా అల్లు అర్జున్ బాటలో నాగ చైతన్య నడుస్తున్నాడా? నడవబోతున్నాడా? అదే ఇప్పుడు వినిపిస్తున్న ఇంట్రెస్టింగ్ న్యూస్.

Advertisement
CJ Advs

అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమాలో గెస్ట్ రోల్ కోసం బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నాగ చైతన్య ని బాలీవుడ్ మీడియా హైలెట్ చెయ్యడం వెనుక తన పిఆర్ టీం ఉంది అని అంటున్నారు. టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోగా క్రేజ్ ఉన్న నాగ చైతన్య పేరు ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో హైలెట్ అవుతుంది. లాల్ సింగ్ చద్దా లొకేషన్స్ నుండి ఫొటోస్ పోస్ట్ చెయ్యడం, ఈ సినిమా మాత్రమే కాకుండా నాగ చైతన్య కి ఇంకా కొన్ని స్పెషల్ ఆఫర్స్ బాలీవుడ్ డైరెక్టర్స్ ఇస్తున్నారని, చైతు కూడా ఆచి తూచి సెలెక్ట్ చేసుకుంటున్నాడని అంటున్నారు. ఇక చైతన్య బాలీవుడ్ లో పర్సనల్ టీమ్ ని మెయింటింగ్ చేస్తున్నాడనే టాక్ సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది. ఇదంతా బాలీవుడ్ లో పాగా వేసేందుకే అంటున్నారు.

Naga Chaitanya following Allu Arjun:

Naga Chaitanya bollywood Publicity
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs