మెగాస్టార్ చిరంజీవి అంటేనే స్టయిల్ కి మారు పేరు. రకరకాల లుక్స్ తో, రకరకాల కేరెక్టర్స్ అంటే లవర్ బాయ్ గాను, మాస్ గాను, అన్నగాను ఇలా రకరకాల కేరెక్టర్స్ తో తనకంటూ అద్భుతమైన ఇమేజ్ ని ఎవరికీ లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పరుచుకున్న మెగాస్టార్ చిరు ఈ వయసులోనూ ఇంకా ఫిట్ నెస్ తో స్టయిల్ గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కొడుకు రామ్ చరణ్ తో ఆచార్య మూవీ చేస్తున్న చిరు.. ఈ సినిమాలో నక్సలైట్ గా ఆచర్యగా కనిపిస్తున్నారు. ఈ సినిమా తర్వాత చిరు మలయాళ సూపర్ హిట్ ఫిలిం లూసిఫెర్ రీమేక్ లో నటిస్తున్నారు. అలాగే బాబీ డైరెక్టన్ లో మరో మూవీలో నటించబోతున్నారు. మరి లూసిఫర్ లో కథానుసారం చిరు కాస్త ఓల్డ్ లుక్ లోనే కనిపించాలి. ఇక బాబీ సినిమాలో చిరు స్టైలిష్ గా కనిపిస్తారని ప్రచారం ఉంది.
అయితే తాజాగా చిరు లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఏ సినిమా కోసమో తెలియదు కానీ చిరు కొత్త ఫోటో షూట్ మాత్రం వైరల్ అయ్యింది. ఆ పిక్ లో చిరు చాలా అంటే చాలా యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు. చాలా స్టైలిష్ గా కనిపిస్తున్న చిరు ని చూసి మెగా ఫాన్స్ ఎక్కడా ఆగడం లేదు. క చిరు బర్త్ డే, ఆచార్య రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న మెగా ఫాన్స్ కి చిరు కొత్త లుక్ బాగా కిక్కిచ్చింది.