రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబోలో పాన్ ఇండియాలో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ ఫైనల్ షెడ్యూల్ షూట్ ఉక్రెయిన్ లో జరుగుతుంది. ఆర్.ఆర్.ఆర్ టీం మొత్తం ఉక్రెయిన్ లోనే సందడి చేస్తుంది. ఇక దోస్తీ సాంగ్ దగ్గర నుండి ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ కూడా మొదలైపోయాయి. జక్కన్న ఆర్.ఆర్.ఆర్ ని అక్టోబర్ 13 న రిలీజ్ చేసే వరకు నిద్రపోయేలా కనిపించడం లేదు. పని రాక్షుసుడు అంటారు కదా ఆ రేంజ్ లో పని చేస్తున్నారు ఆయన.
ఇక మొన్నటికి మొన్న ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ కోసం బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అలియా భట్ ఇన్స్టా గ్రామ్ ని ఉపయోగించిన రాజమౌళి ఇప్పుడు ఎన్టీఆర్ ఇన్స్టా ఖాతాని కూడా స్వాధీనం చేసుకుని ఆర్.ఆర్.ఆర్ అప్ డేట్స్ ఇస్తారు. స్టార్స్ సోషల్ మీడియా ఖాతాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఏదైనా అప్ డేట్ ని ఫాన్స్ క్షణాల్లో వైరల్ చేస్తారు. ఇక ఇప్పటివరకు దానయ్య , డివివి ఎంటర్టైన్మెంట్, ఆర్.ఆర్.ఆర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి ఆర్.ఆర్.ఆర్ అప్ డేట్స్ ఇచ్చిన టీం.. ఇక మీద ఏ అప్ డేట్ ఇచ్చిన ఆర్.ఆర్.ఆర్ టీం ఇక్కపై ఎన్టీఆర్ ఇన్స్టా నుండి పోస్ట్ చేస్తుంది.
సో అలా అభిమానుల నుండి ఆర్.ఆర్.ఆర్ పై క్రేజ్ పెరుగుతుంది. ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ఇప్పుడు భీం ఎన్టీఆర్ చేతికి వచ్చాయి. దానితో ఎన్టీఆర్ ఫాన్స్ ఫుల్ గా పండగ చేసుకుంటున్నారు.