రామ్ చరణ్ - శంకర్ కాంబోలో సెప్టెంబర్ లో మొదలు కాబోతున్న RC15 పై రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హైలెట్ అవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇప్పటికే ట్యూన్స్ రెడీ చేస్తుంటే... హీరోయిన్ కియారా అద్వానీ RC15 కోసం రెడీ అవుతుంది. బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా ఉన్న కియారా రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ అనగానే అందరిలో ఆశక్తి, అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో తెరకెక్కనున్న ఈ మూవీపై పలు భాషల్లో అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కియారా RC15 కోసం నిర్మాతల నుండి భారీ పారితోషకం అందుకోబోతుంది అనే టాక్ మొదలైంది.
బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న కియారా అక్కడ ఒక్కో ప్రాజెక్ట్ కోసం మూడు నుండి నాలుగు కోట్లు అందుకుంటుంటే... ఇప్పుడు రామ్ చరణ్ తో తెరకెక్కబోయే పాన్ ఇండియా మూవీ కోసం 5 కోట్లు అడగడం, దిల్ రాజు మారు మాట్లాడకుండా.. కియారా అద్వానీ అడిగింది ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారట. కియారా అద్వానీ - రామ్ చరణ్ కలిసి అట్టర్ ప్లాప్ వినయ విధేయరామ మూవీలో నటించినా.. వాళ్ళ పెయిర్ కి మంచి మార్కులు పడడంతో.. ఇప్పడు మరోసారి ఈ పెయిర్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.