ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అయ్యి చిన్న, మీడియం హీరోలు లకి జై కొడుతున్న.. మీడియం రేంజ్ మేకర్స్ మాత్రం ప్రేక్షకులు థియేటర్స్ కి రావడానికి భయపడుతున్నారు.. ఇలాంటి టైం లో సినిమాలను థియేటర్స్ లో విడుదల చేసి నష్టపోయేకన్నా ఓటిటి లకే జై కొడితే పోలా అనేట్టుగా ఉంది వ్యవహారం. మేము మా సినిమాని థియేటర్స్ లో విడుదల చేస్తామని బల్ల గుద్ది చెప్పిన నాని టక్ జగదీశ్ మేకర్స్ చివరికి ఓటిటికి జై కొట్టినట్లుగా ఇప్పుడు మరికొంతమంది హీరోలు ఓటిటికే జై అంటున్నారని టాక్. ఇప్పటికే విరాట పర్వం సినేమానికి ఓటిటి నుండి భారీ డీల్ కోసం వెయిట్ చూస్తున్నారు మేకర్స్.
అలాగే లవ్స్ స్టోరీ సంగతి ఏప్రిల్ లో విడుదల అంటూ హడావిడిగా డేట్ ప్రకటించి తర్వాత కొన్ని అనివార్య కారణాలతో వాయిదా వేసిన గోపీచంద్ సీటిమార్ ని ఇప్పుడు ఓటిటి కి అమ్మే ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. గోపీచంద్ - తమన్నా కాంబోలో సంపత్ నంది తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ - తమన్నాలు కబడ్డీ జట్లకు కోచ్‌లుగాకనిపించనున్నారు. అయితే సీటిమార్ కి పలు ఓటిటి లు మంచి ఆఫర్ ఇస్తున్నా.. సన్ నెక్ట్స్ అత్యధిక మొత్తం వెచ్చించి సీటిమార్ హక్కులను కొనుగోలు చేసిందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన.. ఈ సినిమాను ఈ నెలలోనే విడుదల చేస్తారని అని.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కొద్ది రోజుల్లోనే వెలువడనుందని తెలుస్తోంది.