Advertisement
Google Ads BL

మా అధ్యక్షుడు నరేష్ పై హేమ హాట్ కామెంట్స్


ప్రస్తుతం మాఎన్నికల విషయంలో ప్రకాష్ రాజ్ - మంచు విష్ణు నువ్వా నేనా అంటున్నారు. ప్రకాష్ రాజ్ కామ్ గా తెగేదాకా లాక్కండి.. అంటూ ట్వీట్స్ చేస్తున్నాడు. మరోపక్క మంచు విష్ణు ఛానల్స్ కి ఇంటర్వ్యూ లు, వీడియోస్ వదులుతూ మా ఎన్నికల విషయాన్ని కాక పుట్టిస్తూన్నారు. మధ్యలో నందమూరి బాలకృష్ణ మా అధ్యక్షుడుగా ఉంటే మాకు ఓకె అంటూ మంచు విష్ణు కామెంట్స్ చేస్తున్నాడు. ఇదంతా ఒక ఎత్తైతే.. నటి హేమ ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వేడి వేడి చర్చలకు దారి తీశాయి. 

Advertisement
CJ Advs

మా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న హేమ ప్రస్తుతం మా అధ్యక్షడు నరేష్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. మరోసారి నరేష్ అధ్యక్షుడిగా కొనసాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, లేదంటే ఎన్నికలే లేకుండా చేసేందుకు చూస్తున్నారని, అసలు 5 కోట్ల నిధుల్లో 3 కోట్లు మాత్రమే నరేశ్‌ ఇప్పటివరకూ ఖర్చు చేశారని.. మిగతావి ఏం చేశారని హేమ నరేష్ పై విరుచుకుపడింది. ఈ ఎన్నికలు అడ్డుకోవాలనుకుంటే తీవ్రపరిణామాలు ఎదుర్కుంటారంటూ హేమ 200 మంది మా సభ్యులకి లేఖలు రాయడం కలకలం సృష్టించింది. 

Hema Sensational comments on MAA president Naresh:

Hema Sensational comments 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs