Advertisement
Google Ads BL

RC15 కి దిల్ రాజు కండిషన్స్


రామ్ చరణ్ - కోలీవుడ్ శంకర్ కాంబోలో టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు RC15 ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే కోలీవుడ్ శంకర్ తో సినిమా అంటే నిర్మాతలు ఆస్తులు అమ్ముకోవాల్సిందే అంటారు. అంతలా ఖర్చు పెట్టించేస్తారు శంకర్. కోలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థలే శంకర్ అంటే భయపడిపోతారు. అందులోను ఆయన చెప్పిన బడ్జెట్ కి సినిమాకి ఖర్చు ఈపాట బడ్జెట్ కి పొంతనే ఉండదు.. చాలాసార్లు ఆయన సినిమాల్లో బడ్జెట్ క్రాస్ అవుతూనే ఉంటుంది. మరి ఇక్కడ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అలా కాదు. అన్నిటికి లెక్కే. 

Advertisement
CJ Advs

ఇండియన్ 2 శంకర్ తో ప్రకటించి.. దిల్ రాజు అప్పట్లో చల్లగా జారుకున్న విషయం తెలిసిందే. మళ్ళీ ఏ ధైర్యంతో దిల్ రాజు శంకర్ తో సినిమా చేస్తున్నాడంటే.. శంకర్ కి RC15 విషయంలో దిల్ రాజు చాలా కండిషన్స్ పెట్టారట. అదేమిటంటే.. చెప్పిన బడ్జెట్ లోనే సినిమా పూర్తి చెయ్యాలి. కొద్దిగా అటు ఇటు ఉన్నా పర్లేదు.. కానీ మరి పరిమితి మించితే శంకర్ పారితోషకంలో కట్ చెయ్యాల్సి వస్తుంది అని శంకర్ కి దిల్ రాజు కండిషన్ పెట్టి RC15 పట్టాలెక్కించడానికి రెడీ అయినట్లుగా.. మీడియా లో న్యూస్ ప్రచారంలోకొచ్చింది. 

మరి టాప్ డైరెక్టర్ శంకర్ కి దిల్ రాజు కండిషన్స్ పెట్టగలరా? అలా పెడితే శంకర్ సినిమాని ఫ్రీ గా అంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా చెయ్యగలరా? ఇదంతా జస్ట్ రూమర్ అంటూ మెగా ఫాన్స్ కొట్టిపారేస్తున్నారు. శంకర్ - దిల్ రాజు - రామ్ చరణ్ RCE 15 సెప్టెంబర్ 8 న పూజ కార్యక్రమాలతో మొదలై.. అక్టోబర్ నుండి రెగ్యులర్ షూట్ కి వెళ్లనున్నట్టుగా తెలుస్తుంది. 

Dil Raju Conditions for RC15?:

Dil Raju Conditions To Kollywood Director Shankar?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs